Unstoppable with NBK: రెండు ఎపిసోడ్లకే ఆగిపోయిన బాలకృష్ణ షో.. అసలు కారణం చెప్పిన ఆహా

దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో వచ్చినా.. చాలా తక్కువ సమయంలో స్టార్‌గా ఎదిగిపోయిన ఆయన.. అప్పటి నుంచి ఎన్నో విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సినిమాల్లో నటించిన బాలయ్య.. ఇటీవలే ఆహా సంస్థ కోసం 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' అనే షోతో హోస్టుగా పరిచయం అయ్యారు. ఆరంభంలోనే సక్సెస్‌ను అందుకున్న ఈ షో.. రెండు ఎపిసోడ్లకే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆహా సంస్థ అసలు బాలయ్య షో ఎందుకు ఆగిపోయిందో వివరించింది. ఆ సంగతులు మీకోసం!

‘అఖండ'గా మారిపోయిన బాలకృష్ణ

‘అఖండ'గా మారిపోయిన బాలకృష్ణ

కొంత కాలంగా ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న చిత్రమే 'అఖండ'. దీన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ ఇందులో హీరోయిన్‌. పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తోంది. శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు.

 అందరినీ లైన్‌లో పెట్టేసిన నటసింహా

అందరినీ లైన్‌లో పెట్టేసిన నటసింహా

'అఖండ' మూవీ షూటింగ్ జరుగుతుండగానే నందమూరి బాలకృష్ణ ఎన్నో చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేనితో చేయబోయే సినిమాను ప్రకటించారు. దీని తర్వాత బాలయ్య.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమాను చేయనున్నారు. వీటి తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ఒక సినిమా.. శ్రీవాస్‌తో మరో సినిమాను చేస్తారట.

 అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే టాక్ షోతో

అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే టాక్ షోతో

లేటు వయసులోనూ నందమూరి బాలకృష్ణ ప్రయోగాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'Unstoppable with NBK' అనే టాక్ షోతో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అల్లు అరవింద్‌కు చెందిన ఆహా సంస్థ దీన్ని రూపొందించింది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ టాక్ షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ను ప్రసారం చేశారు.

రెండు ఎపిసోడ్స్ పూర్తి.. సూపర్ హిట్

రెండు ఎపిసోడ్స్ పూర్తి.. సూపర్ హిట్

'Unstoppable with NBK' టాక్ షో ఇప్పటికే రెండు ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. మొదటి దానికి మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణులు గెస్టులుగా వచ్చారు. రెండో ఎపిసోడ్‌కు నేచురల్ స్టార్ నాని వచ్చాడు. ఈ రెండింటికీ నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ టాక్‌ షోకు చాలా క్లిక్కులు దక్కడంతో సూపర్ డూపర్ హిట్ అయింది.

 రెండు ఎపిసోడ్లకే ఆగిపోయిన టాక్ షో

రెండు ఎపిసోడ్లకే ఆగిపోయిన టాక్ షో

ఆహా వీడియోలో 'Unstoppable with NBK' టాక్‌ షోను ప్రతి శుక్రవారం స్ట్రీమింగ్ అయ్యేలా ప్లాన్ చేశారు. అలాగే, రెండో ఎపిసోడ్‌ను కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ శుక్రవారం అంటే ఈరోజు మూడో ఎపిసోడ్ వస్తుందని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ, అది మాత్రం జరగలేదు. ఫలితంగా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో రెండు ఎపిసోడ్లకే పరిమితం అయిపోయింది.

ఎన్నో అనుమానాలు.. మళ్లీ వస్తుందా?

నటసింహా నందమూరి బాలకృష్ణ హోస్టుగా మారి చేస్తోన్న 'Unstoppable with NBK' రెండు ఎపిసోడ్లకే ఆగిపోవడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ షో మళ్లీ వస్తుందా? రాదా? అని చాలా మంది చర్చించుకుంటున్నారు. మరోవైపు, బాలయ్యకు సర్జరీ జరగడం వల్లే ఇది ఆగిపోయి ఉండొచ్చన్న టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది.

Recommended Video

Madhura Wines Movie Team Chit Chat With Filmibeat Telugu | Part 4
 బాలయ్య షో ఆగిపోవడంపై ఆహా క్లారిటీ

బాలయ్య షో ఆగిపోవడంపై ఆహా క్లారిటీ

'Unstoppable with NBK' ఆగిపోవడంపై ఆహా సంస్థ స్పందించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేసి 'కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా ఈ వారం ఎపిసోడ్‌ను విడుదల చేయలేదు. కానీ త్వరలోనే గట్టిగా రాబోతున్నాము.. అప్పటిదాకా ఆయన పేరు మీకు తెలుసు, ఆయన స్థానం మీ మనసు' అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X