హైదరాబాదులో అహ నా పెళ్లంట ‘మ్యాచ్ ఫిక్సింగ్’....
నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిన 'అహ నా పెళ్లంట" టైటిల్ ను రిపీట్ చేస్తూ అల్లరి నరేష్ హీరోగా వీరభద్ర చౌదరిని దర్శకునిగా పరిచయం చేస్తూ అనిల్ సుంకర నిర్మిస్తున్న చిత్రం 'అహ నా పెళ్లంట" (మ్యాచ్ ఫిక్సింగ్). ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని వివిద లోకేషన్స్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వీరభద్రం మాట్లాడతూ...'నరేష్ శైలికి తగ్గ చిత్రమిది. ఆద్యంతం నవ్వులు పండించే కథ, కథనాలతో తెరకెక్కుతోంది. పెళ్లి కోసం ఓ యువకుడు పడిన పాట్లేంటో తెరపైనే చూడాలి. ఇంటిల్లిపాదిని మెప్పించేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నా" మని తెలిపారు. ఈ చిత్రంలో శ్రీహరి ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. రీతు బర్మేచా కథానాయికగా నటిస్తున్నదన్నారు.
అల్లరి నరేష్ అహనా పెళ్లంట వీరభద్ర చౌదరి అనిల్ సుంకర్ రీతు బర్మేచా శ్రీహరి allari naresh aha na pellanta veerabhadra chowdary anil sunkar reethu barmecha srihari


Click it and Unblock the Notifications