జులై 9న 'అహనా పెళ్ళంట' శతదినోత్సవ వేడుకలు

By Sindhu

అల్లరి నరేష్ హీరోగా రియల్ స్టార్ శ్రీహరి, పద్మశ్రీ బ్రహ్మానందం ప్రత్యేక పాత్రల్లో ఏటివి అనీల్ సుంకర సారధ్యంలో ఏకే ఎంటర్ టైంన్మెంట్స్ పతాకంపై వీరభద్రంను దర్శకుడిగా పరిచయం చేస్తూ సుంకర రామబ్రహ్మం నిర్మించిన 'అహనా పెళ్ళంట' దిగ్విజయంగా అన్ని ముఖ్య కేంద్రాల్లో జూన్ 9 కి 100 రోజులు పూర్తీ చేసుకుంది.

ఈ సందర్భంగా ఏటివి అనీల్ సుంకర మాట్లాడుతూ 'ఈవివి గారికి అంకితం ఇచ్చిన మా 'అహనా పెళ్ళంట' చిత్రాన్ని శతదినోత్సవ చిత్రంగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ చిత్రం శతదినోత్సవ వేడుకల్ని జులై 9 న హైదరాబాద్ లో జరపడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

చిత్ర దర్శకుడు వీరభద్రం చౌదరి మాట్లాడుతూ 'అహనా పెళ్ళంట ని సూపర్ హిట్ చేసి తోలి చిత్రంతోనే నన్ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ని చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. దర్శకుడుగా నాకు అవకాసం ఇచ్చిన అనీల్ గారికి, అల్లరి నరేష్ గారిని, నాకు సహకరించిన యూనిట్ మెంబర్స్ అందరికీ 100 రోజులు పూర్తయిన ఈ శుభసందర్భంలో హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అన్నారు.

సహా నిర్మాత గరికపాటి కిషోర్ మాట్లాడుతూ 'అహనా పెళ్ళంట విజయానికి కారకులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఎగ్జిబ్యూటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు థ్యాంక్స్' అన్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X