'అహనా హిట్టంట' అంటూ ఎగిరి గంతులు వేస్తున్న హీరో
'ఈ కధ మీద మొదటినుండి నాకు ఎంతో నమ్మకం వుంది. నిర్మాత అనీల్ గారు ప్రతి విషయంలోనూ ఎంతో కేర్ తీసుకొని కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించడం వలన ఇంతటి అద్భుత విజయాన్ని సాధించింది. వీరభద్రం చౌదరి తోలి చిత్రంతోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నందుకు ఆనందంగా వుందంటూ అల్లరి నరేష్ సంతోషంగా చెప్పుకొచ్చారు. అల్లరి నరేష్ తాజా చిత్రం 'అహనా పెళ్ళంట'చిత్రం 48 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంటోంది.ఈ సందర్బంగా మీడియాతో హీరో నరేష్ మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే రియల్ స్టార్ శ్రీహరి గారితో, ప్రద్మశ్రీ డా.బ్రహ్మానందం గారితో కలిసి ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం మంచి అనుభూతినిచ్చింది. టోటల్ గా అహ నా పెళ్ళంట ఆనందాన్ని పంచింది. ఐ యామ్ వెరీ హ్యాపీ' అన్నారు. దర్శకుడు వీరభద్రం చౌదరి మాట్లాడుతూ 'నా తోలి చిత్రమే 48 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన అనీల్ గారికి, అల్లరి నరేష్ గారికి, సహకరించిన యూనిట్ లోని ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు' అన్నారు.


Click it and Unblock the Notifications











