అల్లరి నరేష్ 'అహనా పెళ్ళంట' రిలీజ్ వాయిదా ఎప్పటికంటే...
అల్లరి నరేష్ తాజా చిత్రం అహనా పెళ్ళంట..విడుదల తేదీ మళ్లీ వాయిదా పడింది. ఈ చిత్రం మొదట పిబ్రవరి 18న విడుదల అనుకున్నప్పటికీ దానిని పిబ్రవరి 25కి వాయిదా వేసారు. పెళ్ళి వలలో ఇరుక్కుపోయి గిజ గిజలాడే సుబ్బారావుగా ఈ చిత్రంలో నరేష్ కనిపించనున్నాడు. వీరభద్రచౌదరి దర్శకత్వంలో బిందాస్ నిర్మాతలు అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇక ఈ టైటిల్ కి మ్యాచ్ ఫిక్సింగ్ అనే ట్యాగ్ లైన్ గా పెట్టారు. అలాగే ఈ చిత్రం ద్వారా రీతూ అనే హీరోయిన్ పరిచయం అవుతోంది. ఇక అల్లరి నరేష్ చేసిన హిట్ సినిమాలు అత్తిలి సత్తిబాబు, బెండు అప్పారావ్, బెట్టింగ్ బంగార్రాజు లా ఈ చిత్రం కూడా వర్కవుట్ అవుతుందంటున్నారు. అలాగే అహనా పెళ్ళంట టైటిల్ గతంలో రాజేంద్రప్రసాద్ తో జంధ్యాల సృష్టించిన అధ్బుతమైన కామిడీ కి పెట్టారన్న సంగతి తెలిసిందే.
అల్లరి నరేష్ అహనా పెళ్ళంట అప్పుల అప్పారావు మడతకాజా కత్తి కాంతారావు allari naresh k vishwanath subhapradam saradaga kasepu katti kantha rao


Click it and Unblock the Notifications