చిన్న పొరపాటు జరిగింది.. మెగాస్టార్ ఎవరో అందరికీ తెలుసు.. ఆహా టీం క్షమాపణలు
ప్రస్తుతం ఆహా టీం అల్లు బ్రాండ్‌కు గుర్తింపుగా మారింది. ఆహా అంటే పూర్తిగా అల్లు వారి ఆధిపత్యమే. ఆహా లోగోలోనూ అల్లు అర్జున్ ప్రతిబింబించేలా ఉంటుంది. అలాంటి ఆహా అల్లు అర్జున్‌ను ఏకంగా మెగాస్టార్‌ను చేసేసింది. అల్లు అర్జున్‌కు ఆల్రెడీ స్టైలీష్ స్టార్ అనే ట్యాగ్ ఉండగా.. ఆహా టీం మాత్రం అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. ఆ అత్యుత్సాహామే ఆహా కొంప ముంచినట్టు కనిపించింది. అందుకే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

సామ్ జామ్‌లో బన్నీ
సమంత సామ జామ్ షోలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఎపిసోడ్ భారీగా క్లిక్ అయింది. మొదటి ఎపిసోడ్‌లో విజయ్ దేవరకొండను గెస్ట్‌గా తీసుకొచ్చాడు. ఆ మొదటి ఎపిసోడ్, చిరంజీవి ఎపిసోడ్ బాగానే క్లిక్ అయింది. ఇక బన్నీతో సమంత ముచ్చట్లు కూడా బాగానే వైరల్ అయ్యేలా కనిపిస్తున్నాయి.

నూతన సంవత్సరం..
కొత్త ఏడాది కానుకగా జనవరి 1న అల్లు అర్జున్‌కు సంబంధించిన ఎపిసోడ్ ప్రసారం కానుందని ప్రకటించాడు. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమోలు కూడా బాగానే వైరల్ అయ్యాయి. అందులో అన్నీ బాగానే ఉన్నా కూడా బన్నీని మెగాస్టార్ అని సంబోధించడంపై అందరూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఆహా, బన్నీపై ట్రోలింగ్..
బన్నీని మెగాస్టార్ అని చెప్పడంపై ఆహా టీంను నెటిజన్లు ఏకిపారేశారు. మీది మీరు ఇచ్చేసుకుంటున్నారా? మెగాస్టార్ స్థాయికి ఎవ్వరూ చేరుకోలేరు.. ఆ స్థాయి ఏ హీరోకూ లేదంటూ నెటిజన్లు ఆహా, బన్నీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
Recommended Video

దిగొచ్చిన ఆహా..
అయితే 2020 ముగుస్తుండటం.. కొత్త ఏడాది వస్తోన్న తరుణంలో ఇలాంటి గొడవలు ఎందుకు.. అన్నీ మరిచిపోదాం క్షమించండంటూ ఆహా టీం అందరినీ వేడుకుంది. ఏదో చిన్న పొరపాటు వల్ల అలా జరిగింది. అయినా మెగాస్టార్ అనే వారు ఒక్కరే ఉంటారు.. అది ఎవరో కూడా మనందరికీ తెలుసు అంటూ మెగా ఫ్యాన్స్‌ను కూల్ చేసే ప్రయత్నం చేసింది.


Click it and Unblock the Notifications











