‘క్రాక్’ విడుదలపై వెనక్కితగ్గిన ‘ఆహా’.. కారణం అదేనట!

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ మీద దాడి చేస్తున్నాడు. ఇన్నాళ్ల కసిని ఇలా క్రాక్ సినిమాతో తీర్చేసుకుంటున్నాడు. సంక్రాంతి కంటే వారం ముందు రిలీజ్ చేసినా కూడా ఇప్పటికీ అదిరిపోయే కలెక్షన్లతో దుమ్ములేపుతోంది. రవితేజ కెరీర్‌లొనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పటికీ కళ్లు చెదిరే వసూళ్లను రాబడుతోంది. ఈ క్రమంలోనే ఆహా టీం ఓ ప్రకటన చేసింది. క్రాక్‌ను ఈ వారం ఓటీటీలో రిలీజ్ చేస్తామని తెలిపింది.

కమిట్‌మెంట్ మూవీ స్టిల్స్ : అన్వేషి జైన్, తేజస్వీ మడివాడ హాట్ గ్యాలరీ (ఫొటోలు)

థియేటర్ల వద్ద జాతర..

థియేటర్ల వద్ద జాతర..

క్రాక్ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. యాభై శాతం ఆక్యుపెన్సీ అయినా కూడా థియేటర్ల వద్ద జాతర వాతావరణాన్ని తలపిస్తోంది. అలా క్రాక్ సినిమాకు రోజురోజుకూ ఆదాయం పెరుగుతూనే వస్తోంది. ఇప్పటికీ కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

యాభై కోట్ల క్లబ్‌లోకి..

యాభై కోట్ల క్లబ్‌లోకి..

రవితేజ వరుసగా ఫ్లాపులతో సతమవుతున్న తరుణంలో క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. అన్ని పరిస్థితులు కలిసి రావడంతో కలెక్షన్లలో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. క్లియర్‌గా సంక్రాంతి విన్నర్‌గా రవితేజ తన సత్తాను చాటాడు. దెబ్బకు యాభై కోట్ల క్లబ్‌లోకి చేరిపోయాడు.

ఓటీటీలోకి..

ఓటీటీలోకి..

ఇక థియేటర్‌లలో దుమ్ములేపుతున్న ఈ సినిమాను ఆహాలో ప్రసారం చేయబోతోన్నామని ప్రకటించారు. మామూలుగా అయితే ఈ వారం నుంచి క్రాక్ సినిమా ఆహాలో అందుబాటులోకి రావాల్సింది. కానీ సడెన్‌గా వారు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా చేశారు.

క్రాక్ విడుదలపై వెనకడుగు..

క్రాక్ విడుదలపై వెనకడుగు..

క్రాక్ సినిమాను ఆహాలో ప్రసారం చేయాల్సింది కానీ దాన్ని ఫిబ్రవరి 5వరకు వాయిదా వేస్తున్నామని ఆహా టీం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్ట్ చేసింది. ఆహా అనేది సినీ పరిశ్రమలో ఓ భాగం.. సినిమా, ఇండస్ట్రీ బాగుండేందుకు ప్రతీ విషయంలో తోడుంటామని చెప్పుకొచ్చింది.

Recommended Video

Allu Arjun’s Ala Vaikunthapurramuloo in Top Of Netflix's TOP 10 Most Watched Films Of 2020
ఇంకా దుమ్ములేపుతోంది..

ఇంకా దుమ్ములేపుతోంది..

ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని క్రాక్ సినిమాను ఆహాలో ఫిబ్రవరి 5న విడుదల కాబోతోందని తెలిపారు. రవితేజ, శ్రుతీ హాసన్, గోపీచంద్ మలినేని, నిర్మాత మధు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇలా అందరికీ శుభాకాంక్షలు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇంకా దుమ్ములేపుతోందని కంగ్రాట్స్ చెప్పింది ఆహా టీం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X