హేమా మాలిని కూతురు పెళ్లి డేట్ ఫిక్సయింది (ఫోటోలు)
ముంబై : బాలీవుడ్ స్టార్స్ హేమా మాలిని, ధర్మేంద్రల చిన్న కూతురు అహానా డియోల్ ఎంగేజ్మెంట్ ఢిల్లీకి చెందిన బిజినెస్ మేన్ వైభవ్ వోరాతో జూన్ నెలలో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి పెళ్లి డేట్ ఫిక్సయింది. ఫిబ్రవరి 2న ముంబైలోని జుహులో అహనా-వైభవ్ వివాహ మహోత్సవం జరుగనుంది.
తల్లిదండ్రులు ధర్మేంద్ర, హేమమాలిని, సోదరి ఇషా డియోల్‌లా బాలీవుడ్ దారి పట్టకుండా తనదైన ప్రత్యేక దారిని ఎంచుకుంది అహనా. ఆమె ఒడిస్సీ నృత్య కళాకారిణి, ఫ్యాషన్ డిజైనర్. వైభవ్ వోరాతో అహనా డియోల్ స్నేహితులు. స్నేహం కాస్త ప్రేమగా మారి జీవిత భాగస్వాములు కాబోతున్నారు.
గత సంవత్సరం ఆమె సోదరి ఇషా డియోల్ వివాహం భరత్ తక్తాని అనే బిజినెస్ మేన్‌తో జరిగిన సంగతి తెలిసిందే. అహనా డియోల్, వైభవ్ వోరా ఇషా-భరత్ పెళ్లి సందర్బంగా పరిచయం అయ్యారు. అహానా-వైభవ్ మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలియడంతో ఇద్దరినీ ఏకం చేసారు.

అహనా డియోల్
అహనా డియోల్ బాలీవుడ్ స్టార్స్ ధర్మేంద్ర, హేమా మాలిని చిన్న కుమార్తె. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఆమె సోదరి ఇషా డియోల్ ఎంగేజ్మెంట్ పార్టీ సందర్భంలోనిది.

ఇషా వెడ్డింగులో అహనా
తన సోదరి ఇషా డియోల్ వెడ్డింగ్ సందర్భంగా అహనా డియోల్ ఇలా సాంప్రదాయ దుస్తుల్లో దర్శనం ఇచ్చింది.

తన ఫియాన్స్ వైభవ్ వోరాతో...
తన ఫియాన్స్ వైభవ్ వోరాతో, తల్లిదండ్రులు ధర్మేంద్ర, హేమా మాలినిలతో కలిసి అహనా డియోల్. జూన్ నెలలో జరిగిన అహనా-వైభవ్ ఎంగేజ్మెంట్ వేడు సందర్భంలోని ఫోటో ఇది.

అహనాకు ప్రపోజ్ చేస్తున్న వైభవ్
ఎంగేజ్మెంటు సందర్భంగా తనకు కాబోయే జీవిత భాగస్వామి అహనా డియోల్‌కు ప్రపోజ్ చేస్తున్న వైభవ్ వోరా.

ఫ్యామిలీతో అహనా
ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో అహనా కాబోయే భర్త వైభవ్ వోరా, తల్లిదండ్రులు హేమా మాలిని, ధర్మేంద్ర, భర్త భరత్ తక్తానితో కలిసి సోదరి ఇషా డియోల్‌లను చూడొచ్చు.

చిన్నతనంలో...
చిన్నతనంలో తల్లిదండ్రుల భుజాలపై ఎక్కి ఆడుకుంటున్న అహనా డియోల్, ఇషా డియోల్‌లను ఇక్కడ చూడొచ్చు.

ఇద్దరు కూతుర్లతో హేమా మాలిని
హేమా మాలిని తన ఇద్దరు కూతుర్లు అహనా డియోల్, ఇషా డియోల్‌లతో కలిసి ఉన్న ఫోటోను ఇక్కడ చూస్తున్నాం. ఇషా డియోల్ ఎంగేజ్మెంట్ సందర్భంలో దిగిన ఫోటో ఇది.

ఫ్యామిలీ ఫోటో గ్రాఫ్
ధర్మేంద్ర, హేమా మాలిని తన పిల్లలతో కలిసి ఆనంద క్షణాలను పంచుకుంటున్న సందర్భంలోనిది ఈ దృశ్యం.

అహనా, హేమ మాలిని, ఇషా
తన ఇద్దరు కూతుర్లు అహనా డియోల్, ఇషా డియోల్‌లతో కలిసి హేమా మాలిని. ఈ ఫోటో ఎంతో అద్భుంతంగా ఉంది కదూ..!

వైభవ్ వోరాతో అహనా ఎంగేజ్మెంట్
అహనా డియోల్, వైభవ్ వోరా ఎంగేజ్మెంట్ జూన్ 22న ముంబైలో ఘనంగా జరిగింది.

తల్లి, సోదరితో...అహనా
హేమా మాలిని, అహనా డియోల్, ఇషా డియోల్‌లకు సంబంధించిన అరుదైన ఫోటో ఇది. వయసు పైబడినా కూతుర్లతో ఏ మాత్రం తీసిపోని అందం హేమా మాలినిది. స


Click it and Unblock the Notifications











