హేమా మాలిని కూతురు వెడ్డింగ్ రిసెప్షన్ (ఫోటోలు)
ఢిల్లీ: బాలీవుడ్ స్టార్స్ హేమా మాలిని, ధర్మేంద్రల చిన్న కుమార్తె అహనా డియోల్ వివాహం ఇటీవల ముంబైలో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేసారు. పెళ్లి వేడుకకు ఎక్కువగా సినీ తారలు హాజరు కాగా...వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు రాజకీయ నాయకులు హాజరయ్యారు.
ఢిల్లీకి చెందిన బిజినెస్ మేన్ వైభవ్ వోరాతో ఈ నెల 2న అహనా డియోల్ వివాహం జరిగింది. గత సంవత్సరం ఆమె సోదరి ఇషా డియోల్ వివాహం భరత్ తక్తాని అనే బిజినెస్ మేన్‌తో జరిగిన సంగతి తెలిసిందే. అహనా డియోల్, వైభవ్ వోరా ఇషా-భరత్ పెళ్లి సందర్బంగా పరిచయం అయ్యారు. అహానా-వైభవ్ మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలియడంతో ఇద్దరినీ ఏకం చేసారు.
వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన వారిలో బీజేపీ అగ్రనేతలు ఎల్ కె అద్వానీ, సుష్మా స్వరాజ్ తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

కొత్త జంటతో ధర్మేంద్ర, హేమామాలిని
కూతురు అహనా డియోల్, అల్లుడు వైభవ్ వోరాతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చి హేమా మాలిని, దర్మేంద్ర

ధర్మేంద్రతో సుష్మా స్వరాజ్
బీజేపీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, ధర్మేంద్ర....

రాజకీయ నాయకులు సందడి
అహనా డియోల్, వైభవ్ వోరా పెళ్లి వేడుకకు పలువురు రాజకీయ నాయకుల రాకతో సందడిగా మారింది.

ఎల్ కె అద్వానీ
బిజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ అహనా డియోల్, వైభవ్ వోరా వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన సన్నివేశం ఇక్కడ చూడొచ్చు.

హేమా మాలిని, ధర్మేంద్ర
చిన్న కూతురు అహానా డియోల్ వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా హేమా మాలిని, ధర్మేంద్ర ఎంతో సంతోషంగా కనిపించారు.

పెళ్లి వేడుకలో వీఐపీలు
అహనా డియోల్, వైభవ్ వోరా పెళ్లి వేడుకకు పలువురు వీఐపీలు హాజరయ్యారు. బీజేపీ నేత అరుణ్ జైట్లీ హాజరైన సన్నివేశాన్ని ఇక్కడ చూడొచ్చు.


Click it and Unblock the Notifications











