ఎయిడ్స్‌పై వర్క్ చేస్తానంటున్న ప్రీతీ జింటా
ఎంతో మంది ట్రక్ డ్రైవర్లు ఎయిడ్స్ వ్యాధితో మరిణిస్తున్నారని తెలిసి నేను చాలా షాక్ అయ్యాను. ఇలా ఎందుకు జరుగుతోందంటే వారికి అస్సలు ఏం జరుగుతోందో...ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలియటం లేదు. వారు ఎయిడ్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. నేను దీనిమీద ఢెఫినెట్ గా వర్క్ చేస్తాను. ఈ విషయం విన్నప్పుడు నుంచి నాకు చాలా భాధగా ఉంది. ఇది నేను తప్పనిసరిగా చేయాల్సిన పనిగా భావిస్తున్నాను. మన దేశంలో ఎయిడ్స్ అనేది చాలా ప్రమాదకరమైన స్ధితిలో ఉంది. దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది అంటోంది ప్రీతీ జింతా.
ఆమె ప్రస్తుతం ఎయిడ్స్ ఎవేర్ నెస్ పై ప్రచారం ప్రారంభించటానికి సిద్దంగా ఉంది. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది. ఇక తెలుగులో ఆమె మహేష్ సరసన అప్పట్లో రాజకుమారుడు చిత్రంలో చేసింది. ఆ తర్వాత వెంకటేష్ సరసన ప్రేమంటే ఇదేరా చిత్రం చేసింది. ఈ రెండు చిత్రాల తర్వాత ఆమె తెలుగులో కనపడలేదు. అప్పుడప్పుడూ అడపాదడపా డబ్బింగ్ లతో పలకరిస్తోంది. చేతిలో సినిమాలేమీ లేని ఈ భామ ఇలా ఏదో ఒక రకంగా సమాజానికి ఉపయోగపడే పని చేయాలనే కాంక్షలో తనను తాను బిజీ చేసుకుంటోంది.


Click it and Unblock the Notifications











