నా సంతోషం దూరం.. వారిని ప్రాణాలతో వదలను.. నయనతార
వరుస సక్సెస్‌లతో లేడీ సూపర్‌స్టార్‌గా మారిన నయనతార తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'ఐరా'. సర్జున్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలకు ముస్తాబవుతున్నది. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కావడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మార్చి 20 సాయంత్రం 5 గంటలకు విడుదలై ఆకట్టుకొంటున్నది.

సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో
సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం భవానీ అనే పాత్ర చుట్టూ తిరుగుందనే విషయం ట్రైలర్‌లో ఆసక్తిని రేపింది. దెయ్యాల సినిమాను తెరకెక్కించే ప్రయత్నంలో నయనతారకు ఎదురైన పరిస్థితులను ఆమె ఎలా ఎదురించారని, సమస్యలకు పరిష్కారం ఎలా కనుకొన్నారనే ప్రశ్నలకు జవాబుగా సినిమా ఉంటుందనే క్యూరియాసిటీని ఐరా ట్రైలర్ క్రియేట్ చేసింది. అందవిహీనమైన అమ్మాయిగా, గ్లామర్ లేడిగా నయనతార రెండు షేడ్స్‌లో హావభావాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి.
హై ఇంటెన్సిటీ స్టోరీతో
ఇక మరో పాత్రలో నయనతార పాత్ర ద్వారా నేనే మొదలుపెట్టాను. నేనే పూర్తి చేస్తాను అని చెప్పించిన డైలాగ్స్ సినిమా స్టామినాను తెలియజెప్పాయి. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా, రెగ్యులర్ హారర్ జోనర్లలో కనిపించే వినోదాన్ని మించి ఇంకా ఏదో చేయాలని ప్రయత్నించినట్టు ట్రైలర్‌లో కనిపించింది. సాంకేతికంగా ఎక్కడా రాజీపడినట్టు అనిపించకపోవడం ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా మారింది.

లోకంలో బోలెడన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి
లోకంలో బోలెడన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది అవసరమా? ఈ లోకంలో ఎవరూ ఇవ్వని సంతోషాన్ని నీవు ఇచ్చావు అభి.. దానిని దూరం చేసిన ఎవ్వరినీ ప్రాణాలతో వదిలిపెట్టను అంటూ ఇంటెన్సిటీతో చెప్పిన డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉన్నాయి. సుదర్శన్ శ్రీనివాసన్ సినిమాటోగ్రఫి చాలా థ్రిల్లింగ్‌గా కనిపించింది. హారర్ సన్నివేశాలకు తగినట్టుగా సుందరమూర్తి. కె.ఎస్ అందించిన రీరికార్డింగ్ ట్రైలర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాయని చెప్పవచ్చు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు:
కళైయరసి, యోగిబాబు, మనోబాలా, ఎం.ఎస్.భాస్కర్, వంశీకృష్ణ, ప్రవీణ్ రంగనాథన్, జయప్రకాష్, లీలావతి, కృష్ణ అభిషేక్, రవి ప్రకాష్ తదితరులు
దర్శకత్వం: సర్జున్
కెమెరా: సుదర్శన్ శ్రీనివాసన్,
కూర్పు: కార్తిక్ జోగేష్,
స్క్రీన్‌ప్లే: ప్రియాంక రవీంద్రన్
సంగీతం: సుందరమూర్తి. కె.ఎస్.


Click it and Unblock the Notifications











