డైనమిక్ డైరెక్టర్ కు సలామ్ చేస్తున్న గగన సఖులు... వైరల్ వీడియో
డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పై సడన్ గా గగన సఖులు అంతులేని ప్రేమాప్యాయతలు కురిపించేస్తున్నారు. అంతేకాదు, ఓ సఖి అయితే ఏకంగా పూరీకి వీడియో మెసేజ్ ద్వారా తమందరి తరఫునా కృతజ్ఞతలు తెలియజేసింది. అయితే దీని వెనుక కథాకమామీషు చాలానే ఉందట.
పాన్ ఇండియా మూవీ ఫైటర్ కు శ్రీకారం చుట్టి లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన పూరీ జగన్నాథ్, ఈ మధ్య పాడ్ క్యాస్ట్ ల ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటున్నాడు.
సంస్కృతి సంప్రదాయం దగ్గర నుంచి ఎన్నో విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నాడు. ఇదే కోవలో పలు జీవిత సత్యాలను వెల్లడిస్తూ, మరి కొందరి నైపుణ్యాలను ప్రశంసిస్తూ కాలం గడిపేస్తున్నాడు. ఈ కోవలోనే ఎయిర్ హోస్టెస్ పైనా ఓ పాడ్ క్యాస్ట్ చేసిన పూరికి లండన్ నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.
బ్రిటీష్ ఎయిర్ వేస్ లో క్యాబిన్ క్రూగా పనిచేస్తున్న ప్రియాంకా గిరి అనే తెలుగు అమ్మాయి పూరి చేసిన పాడ్ క్యాస్ట్ పై స్పందిస్తూ డైనమిక్ డైరెక్టర్ కు గగనసఖుల అందరి తరఫునా కృతజ్ఞతలు తెలియజేసింది. ఎంతమంది ఎన్నివిధాలుగా మాట్లాడినా చెరగని చిరునవ్వుతో ఓపికగా కర్తవ్యం నిర్వహించే క్యాబిన్ క్రూపై పూరీ కురిపించిన అభిమానానికి పులకించినపోయిన ప్రియాంకా వీడియో ద్వారా పూరీకి ధ్యాంక్స్ చెప్పుకుంది.

ఇక తన మరిదిగారైనా భధ్రానికి ఇండస్ట్రీలో బ్రేక్ ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు చెబుతూ ముగించింది. మరి దీనికి పూరీ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











