'3 మిస్టేక్స్' ని ఐశ్వర్య రాయ్ ఒప్పుకుంటుందా?
మణిరత్నం రూపొందించిన రావణ్ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా బోల్తా కొట్టడమే కాక, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ చేసిన పాత్రలు సైతం విమర్శల పాలయ్యాయి. నిజ జీవత జోడీ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ మరో సారి జంటగా వెండితెరపై కనిపించబోతున్నారు. '3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్' సినిమాని చేయబోతున్నట్లు బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాని 'రాక్ ఆన్' ఫేమ్ అభిషేక్ కపూర్ డైరెక్ట్ చేయబోతున్నాడు. చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా రూపొందనున్నది. 'రావణ్' సినిమా అనుభవంతో ఐష్, అభి కలిసి ఏ సినిమాకీ సంతకం చేయలేదు. మళ్లీ కలిసి నటించడంపై వాళ్లు సీరియస్‌గా ఆలోచిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఎన్నో ఆఫర్లను వారు తిరస్కరించారు. 'రావణ్' లాంటి తప్పు మరోసారి జరగకూడదనేది వాళ్ల అభిప్రాయం. ఇప్పుడు '3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్' స్క్రిప్టు నచ్చి, చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. ఇక ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం శంకర్ భారీగా రూపొందించిన రోబో చిత్రంపై ఆశలు పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











