హిందీ రీమేక్ లో అరుంధతిగా ఐశ్వర్య రాయ్?
తెలుగులో విజయం సాధించిన అరుంధతి సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా హిందీ హక్కులను జెమిని ఫిల్మ్ సర్క్యూట్ సంస్థ సొంత చేసుకున్నట్లు వినికిడి. ఈ హక్కుల కోసం బోనీ కపూర్ కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, చివరికి ఆ హక్కులు జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ సంస్థకే దక్కినట్లు చెబుతున్నారు. బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ అరుంధతిగా నటించనున్నట్లు సమాచారం. ఐశ్వర్యా రాయ్ అరుంధతిగా నటించడానికి అంగీకరించిన తర్వాతనే ఆ సినిమా రీమేక్ హక్కులను పోటీ పడి ఆ సంస్థ కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. తెలుగులో అరుంధతిగా అనుష్క నటించింది. ఆ పాత్రకు గాను అనుష్కకు మంచి పేరు కూడా వచ్చింది. లోబడ్జెట్ సినిమానే అయినప్పటికీ మంచి విజయం సాధించింది.


Click it and Unblock the Notifications











