అత్తగారి మాట కాదనలేక పోయాను..సారి ఐశ్వర్య రాయ్
"జ్వరాన్ని లెక్క చేయకుండా ఈ ఫంక్షన్‌కి వద్దామనుకున్నా. కానీ మా అత్తగారి మాట కాదనలేకపోయాను. అది మాత్రమే కాకుండా డాక్టర్ కూడా విశ్రాంతి అవసరం అని చెప్పారు. దాంతో ఇంటిపట్టున ఉండిపోయాను. 'రోబో' ఆడియో ఫంక్షన్‌ను చాలా గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఆ ఫంక్షన్ మిస్ అయినందుకు బాధ అనిపించింది' అంటోంది ఐశ్వర్యారాయ్. అలాగే...హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే 'రోబో' ఆడియో ఫంక్షన్‌కి తప్పనిసరిగా రావాలనుకున్నాను. కానీ కుదరలేదు అందామె. ఇక 'రోబో'లాంటి భారీ బడ్జెట్ చిత్రంలో, రజనీకాంత్ సరసన నటించినందుకు ఐష్ తన ఆనందాన్ని కూడా వ్యక్తపరిచారు. ఇక 'రోబో' సినిమా డబ్బింగ్ హక్కులుని రూ.30 కోట్లకు చదలవాడ శ్రీనివాసరావు తీసుకున్నారు. రాష్ట్రంలో 500 నుంచి 600 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా వచ్చే నెల 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఐశ్వర్య రాయ్ రోబో చిరంజీవి రజనీకాంత్ ఎఆర్ రహమాన్ శంకర్ aishwarya rai ar rahman chiranjeevi rajinikanth robo shankar


Click it and Unblock the Notifications