కేన్స్ లో వెల్లువిరిసిన ‘ఐశ్వర్య’ లావెండర్ అందాలు!
ప్రపంచ సినిమా పండుగల్లో అస్కార్ తరువాత అంత పెద్ద పండుగ పండుగ 'కేన్స్" ఫెస్టివల్. నిన్న ఫ్రాన్స్ లో జరిగిన 63 వ ఇంటర్నేషనల్ కేన్స్ ఫెస్టివల్ కు మాజీ విశ్వ సుందిరి ఐశ్శర్య బచ్చన్ ఈ సారి కూడా హాజరు అయ్యారు.
2002 నుంచి వరుసగా ఈ ఫెస్టివల్ కి హాజరు అవుతున్న ఐష్ ఎప్పటిలా తన భర్త అభిషేక్ బచ్చన్ తో కాకుండా డెస్పరేట్ హౌస్ వైఫ్" చిత్రం ఫేమ్ ఇవా లాంగోరియా పార్కర్ అనే నటీమణితో కలసి రెడ్ కార్పెట్ పై నడిచింది. నిజానికి వీరిద్దరూ L'Oreal కు బ్రాన్డ్ అంబాసిడర్స్. గతంలో తన సినిమా దేవదాస్ ప్రదర్శించినప్పుడు చీరకట్టుతో అలరించిన ఐశ్వర్య ఈ సారి మాత్రం వంగపండు రంగులో ఉన్న ముఖమల్ ఫ్రాక్ తో అందమైన శిరోజాలంకరణతో అలరించింది.
ఈసారి కూడా తాను నటించిన మరో సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన ఐశ్వర్య కేన్స్ ఉత్సవంలో మెరిసి మురిపించింది. తన సినిమా రావణ్ ఇక్కడ ప్రమోషన్ కోసం ఐష్ వచ్చింది. ఆమెతో పాటు అభిషేక్ బచ్చన్ మరియు మరో నటుడు విక్రమ్ కూడా హాజరయ్యారట.


Click it and Unblock the Notifications











