మాజీ ప్రియుల గోల గోల: ఐష్ వలవల
ఒక స్త్రీ ఒక మగాడితో సన్నిహితంగా మెలిగితే. అదే స్నేహం అంటారు కొన్నాళ్లు. ఆ తర్వాత దాన్నే డేటింగ్ అంటారు. ఆ తర్వాత ఇంకేదో ఉందంటారు. ఇప్పుడిదే చెపుతున్నారట ఐశ్వర్యరాయ్ మాజీ బాయ్ ఫ్రెండ్స్ సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్. వాళ్లిద్దరూ ఎక్కడబడితే అక్కడ ఐశ్వర్యా రాయ్ తనతో 'అలా ఉంది ఇలా ఉండేది" అని లేనిపోని మాటాలు చెపుతూ గాలికి కట్టేస్తున్నారట. తమ మధ్య కొనసాగిన బంధం ఎటువంటిదో అందరికీ తెలుసుననీ, అయినా వివరించాల్సి వచ్చింది కనుక విడమర్చి చెపుతున్నామని గోల చేస్తున్నారట. అది ఆ నోటా ఈ నోటా తిరిగి చివరికి ఐష్ చెవికి చేరిందట. ఈ మాటలను విన్న ఐశ్వర్యరాయ్ వలవల ఏడ్చేసిందట.
గద్గత స్వరంతో ఐష్, తనకు ఇష్టమైన దారిలో తన జీవితాన్ని గడుపుతున్నాననీ, మిగిలినవారు కూడా అలాగే ఉండాలని చెప్పిందట. అయితే వివేక్ మాత్రం తన కెరీర్ మటాష్ అవడానికి కారణం ఐశ్వర్యరాయేనని పళ్లు నూరుతున్నాడట. అంతేకాదు తన సన్నిహితులతో ఈ విషయాన్నే చెపుతున్నాడట. సల్మాన్ సైతం తనతో డేటింగ్ చేసిన వివరాలను పూసగుచ్చినట్లు ఇంటర్వ్యూల ద్వారా ఏకిపారేస్తున్నాడట. ఐశ్వర్యరాయ్ శ్రేయోభిలాషులు మాత్రం, వివేక్, సల్మాన్లిద్దరూ విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారనీ, ఒక స్త్రీ వివాహంతో కొత్త జీవితంలోకి అడుగెపెట్టాక ఆమె గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలుకుతున్నారట.


Click it and Unblock the Notifications











