ప్రెగ్నేన్సీ తో ఐశ్వర్య ‘హీరోయిన్’ దర్శకునికి పెద్ద షాక్...?
ఐశ్వర్య రాచ్ గర్భవతి అని అమితాబ్ బచ్చన్ మ్యాటర్ బయటపెట్టగానే అందరి చర్చలు 'హీరోయిన్" వైపు సాగుతున్నాయి. వాస్తవిక కథాంశాలతో సినిమాలు తీసే డైరెక్టర్ మాధుర్ భండార్కర్ తన నెక్స్ ట్ టార్గెట్ గా తాను పని చేస్తున్న సినీ సీమనే పెట్టుకున్నాడు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో హీరోయిన్లు పడే కష్టాలని అతను చూపించబోతున్నాడు. హీరోయిన్ కావాలంటే సెక్సువల్ ఫేవర్స్ తప్పవనే జగద్విదిత సత్యాన్ని మాధుర్ కళ్లకు కట్టబోతున్నాడని తెగ సంబర పడిపోయారు.
మరీ బోల్ట్ కంటెంట్ అని తెలియడంతో 'హీరోయిన్" సినిమాలో నటించనని కరీనా కపూర్ తప్పుకుంది. సెక్స్ సీన్స్ మరీ టూమచ్ గా ప్లాన్ చేశాడని, వాటిలో నటిస్తే నటిగా తన ఇమేజ్ పడిపోతుందని కరీనా వివరించింది. ఆ పాత్ర పోషించడానికి ఐశ్వర్య రాయ్ ముందుకొచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన అసలు షూటింగ్ ఇంకా ఆరంభం కాలేదు. టీజర్స్ ని మాత్రం విడుదల చేశారు. ఇప్పుడు ఐశ్వర్య గర్భవతి కాబట్టి..ఆమె ఈ సినిమాలో కంటిన్యూ అవుతుందా లేక తప్పుకుంటుందా అని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి..'హీరోయిన్" తెరకు వస్తుందో లేదో చూడాలి. మరీ ఆమె చేయకపోతే ఆ పాత్రకు ఎవరు కరెక్ట్ గా సూట్ అవుతారు. అన్న విషయంలో మళ్ళీ మొదటికొచ్చింది. ఈ విషయంలో మదుర్ కి పెద్ద షాకే తగిలింది..


Click it and Unblock the Notifications











