ప్రెగ్నింట్..ఎవరు,నేనా స్టార్ హీరోయిన్ మండిపాటు
తను ప్రెగ్నింట్ నంటూ కావాలనే కొంతమంది దుష్పచారం చేస్తున్నారంటూ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ మండిపడుతోంది. అయితే ఇదంతా మేం చేసిన ఓ యాడ్ పిలిం వలన వచ్చింది. అందులో అబిషేక్ నా వంక చూస్తూ..ఓ సంతోషకరమైన వార్త..నువ్వు చెప్తావా..నే చెప్పనా అంటూ అడుగుతాడు. అది చూసిన వారంతా నేను ప్రెగ్నింట్ ననే వార్త చెప్తాడని ఊహిస్తారు. వినటానికి అప్పుడు ఆ యాడ్ బాగానే అనిపించింది. కానీ ఇప్పుడది నెగిటివ్ రూమర్స్ కు దారితీస్తోంది అంటోది ఐశ్వర్యారాయ్. అయితే ఆమె అభయ్ డయోల్ చిత్రం క్రూకెడ్ ఒప్పుకోకపోవటంతో అందరికీ ఈ డౌట్ వచ్చిందంటున్నారు. అయితే మణిరత్నం తో చేస్తున్న రావణ్, సంజయ్ లీలా భన్సాలీ గుజారిష్, శంకర్ రోబో చిత్రాలు పూర్తి కాకుండా ఎలా నిర్ణయం తీసుకుంటాననుకుంటున్నారు అంటోంది. ఇక ఈ విషయాన్ని ఆమె సన్నిహితురాలు బలపరుస్తూ..ఐశ్వర్యకు తన గురించి తాను ఆలోచించటానికి టైమ్ లేదు. రకరకాల ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే బ్రేక్ తీసుకోవటమే మేలని పిస్తోంది అని వ్యాఖ్యానించింది.అయితే తాజాగా ఆమె బెన్ కింగ్లస్ లే సరసన ముంతాజ్ గా చేస్తున్న తాజ్ మహల్ ప్రాజెక్టును కూడా డ్రాప్ చేసుకునేటట్లు ఉందని తెలుస్తోంది.దీని అర్ధమేమిటని మరికొంతమంది అంటున్నారు.


Click it and Unblock the Notifications











