అభిషేక్ చిలిపి చేష్టలతో అప్సెట్ అయిన ఐశ్వర్యారాయ్
అభిషేక్ బచ్చన్ చేసిన చిలిపి పనులకు ఆయన సతీమణి ఐశ్వర్యారాయ్‌కి కోపం వచ్చింది. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కేకేఆర్ (కోల్‌కతా నైట్ రైడర్స్) తరఫున ఏర్పాటు చేసిన ఓ పార్టీకి అభిషేక్ బచ్చన్ ఆహ్వానం లభించింది. ఆ పార్టీకి అభి-ఐష్‌లు జంటగా వచ్చారు. పార్టీకి రాగానే అభిషేక్‌ను ప్రియాంక చోప్రా తన కౌగిలితంలలో బంధించేసింది, అంతేకాకుండా ఆ ఇద్దరూ ఒకరి చెవుల్లో మరొకరు గుసగులాడుకున్నారు. ఇది చూసిన ఐష్‌కు గుండెల్లో కలుక్కుమంది. ఎంత బాలీవుడ్ భామైనా తను కూడా భారత నారీయే కదా.. తన భర్త ఇలా వేరే స్త్రీతో గడుపుతుండటంతో ఆమె కాస్తంత అసూయకు లోనైట్లు సమాచారం.
దోస్తానా, ద్రోణ సినిమాల్లో జంటగా నటించిన ప్రియాంక, అభిషేక్‌లు వారి సంభాషణల్లో పూర్తిగా మునిగి తేలిపోయారు. ఎంతగా మునిగిపోయారంటే... 'ఏవండి ఇప్పటికే చాలా టైమ్ అయింది, ఇక ఇంటికి వెళ్దాం' అన్నట్లుగా ఐష్ ఫోన్ చేస్తున్నా కూడా పట్టించుకోనంతగా వారి సంభాషణ సాగిందట. గత వీకెండ్ ఉదయం మూడు గంటల ప్రాంతంలో అభి-ఐష్‌లు ఆ పార్టీకి వెళ్లారు. పార్టీ నుంచి 4 గంటలకు తిరిగి ఇంటివెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రియతో మాటల్లో మునిగిన తేలుతున్న అభిషేక్ బచ్చన్‌కు టైం తెలియలేదు నాలుగు గంటలు పోయి నాలుగున్నర అయింది.
అప్పటికే ఐష్ చాలా మెసేజ్‌లు/కాల్స్ చేసినా అభి సమాధానమివ్వలేదట. దీంతో చిర్రెత్తిన ఐష్ చీకటిగా ఉన్న ఓ మూల కూర్చుని ఉన్న ప్రియ-అభిల వద్దకు వెళ్లి అభితో 'డార్లింగ్ ఇక వెళ్దామా' సీరియస్‌గా అందట. ఆ తర్వాత 4.35 వారిద్దరూ ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఐశ్వర్యారాయ్‌నే మర్చిపోయేంతలా అభికి ప్రియాంక కంపెనీ ఇచ్చిందన్నమాట. వారిద్దరూ గుసగుసలాడుకుంటున్నప్పుడు ఐష్ చాలా చిరాకుగా ఉన్నట్లు ఆ పార్టీలో కొందరు తెలిపారు. మరి అంతసేపు అభిషేక్‌తో ప్రియాంక ఏం చెప్పిందా అని అక్కడున్న వాళ్లందరూ అవాక్కైయ్యారట.


Click it and Unblock the Notifications











