For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మా నాన్న ఏం తప్పు చేశాడు? అలా చేస్తే లైంగిక వేధింపులా?: హీరోయిన్‌పై అర్జున్ కూతురు ఫైర్!

  |

  ప్రముఖ నటుడు అర్జున్ సార్జా మీద కన్నడ నటి శృతి హరిహరన్ #మీటూ కాంపెయిన్లో భాగంగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. విస్మయ (తెలుగులో 'కురుక్షేత్రం') సినిమా సమయంలో ఓ రొమాంటిక్ సీన్ రిహార్సల్స్ సందర్భంగా అర్జున్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, తన శరీరాన్ని అసభ్యంగా టచ్ చేశాడంటూ చేసిన ఆరోపణలు సౌత్ ఇండిస్ట్రీలో సంచలనం అయ్యాయి.

  #మీటూ: యాక్షన్ స్టార్ అర్జున్ పేరు బయటపెట్టి హీరోయిన్ సంచలనం!

  శృతి హరిహరన్ ఆరోపణలను ఇప్పటికే అర్జున్ ఖండించగా.... అర్జున్ తల్లి లక్ష్మీ దేవమ్మ సైతం తన కుమారుడికి మద్దతుగా నిలిచారు. తాజాగా అర్జున్ కూతురు, నటి ఐశ్వర్య తండ్రికి మద్దతుగా తనదైన వాణి వినిపించారు.

  ఏందుకు ఇలా చేసిందో?

  ఏందుకు ఇలా చేసిందో?

  ఏ ఉద్దేశ్యంతో శృతి హరిహరన్ తన తండ్రిని #మీటూ ఉచ్చులోకి లాంగిందో అర్థం కావడం లేదని ఐశ్వర్య వ్యాఖ్యానించారు. నేను కూడా నటిని, ఇప్పుడిప్పుడే నటన నేర్చుకుంటున్నాను. పెద్ద నటులతో కలిసి వర్క్ షాపులో పాల్గొన్నాను. సినిమా షూటింగ్స్, రొమాంటిక్ సీన్స్ రిహార్సల్స్ ఎలా జరుగుతాయో నాకు తెలుసు అని ఐశ్వర్య వ్యాఖ్యానించారు.

  మా నాన్న నా ముందే రొమాన్స్ చేసి చూపించారు

  మా నాన్న నా ముందే రొమాన్స్ చేసి చూపించారు

  అదృష్టవశాత్తు నేను మా నాన్న దర్శకత్వంలో కూడా సినిమా చేశాను. ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ సమయంలో రొమాంటిక్ సీన్లను ఎలా చేయాలో తన అసోసియేట్ డైరెక్టర్‌(మెన్)తో చేసి చూపించాడు. సీన్ వివరించేందుకు అతడిని దగ్గరకు తీసుకుని హగ్ చేసుకుని, నుటుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. మాకు సీన్ బాగా అర్థమయ్యేందుకు రియాల్టీగా చేసి చూపించాడు. ఆ తర్వాత ఆ అసోసియేట్ డైరెక్టర్ కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు. ఇబ్బంది అనిపించినా అక్కడ చేయాల్సిందే, ఎందుకంటే అది మన వర్క్, ఈ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు అని ఐశ్వర్య చెప్పుకొచ్చారు.

  ఆ సీన్లు తీసేమయన్నాడు

  ఆ సీన్లు తీసేమయన్నాడు

  ‘విస్మయ' సినిమా గురించి నాతో పాటు మా కుటుంబ సభ్యులతో కూడా చర్చించేవారు. ఆ స్క్రిప్టులో కొన్ని రొమాంటిక్ సీన్లు ఇబ్బంది పడే విధంగా ఉంటే వాటిని తొలగించేస్తేనే నటిస్తాను అని దర్శకుడికి చెప్పాడు. ఈవిషయం శృతి హరిహరన్‌కు కూడా తెలుసు అని ఐశ్వర్య అన్నారు.

  మా నాన్న పబ్బుకు కూడా వెళ్లరు

  మా నాన్న పబ్బుకు కూడా వెళ్లరు

  ఈ సినిమాకు శృతి హరిహరన్ పని చేసింది కేవలం 5 రోజులు మాత్రమే. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి మనకు కనీసం రెండు రోజుల సమయం పడుతుంది. రొమాంటిక్ సీన్లు రిహార్సల్ చేసే సమయంలో ఇబ్బంది అనిపిస్తే అప్పుడే చెప్పాల్సింది. మా నాన్న ఆమెను రిసార్టుకు పిలిచాడు, డిన్నర్‌కు పిలిచాడు అంటోంది... అలాంటి చోట్లకు మాన్న అసలు వెళ్లరు. ఆయన పబ్బుకు వెళ్లడం కూడా నేను ఇంతవరకు చూడలేదు.... అని ఐశ్వర్య వెల్లడించారు.

  మా నాన్నకు మద్దతు ఉంటుంది

  మా నాన్నకు మద్దతు ఉంటుంది


  తన మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు వచ్చినందుకు ఏమీ బాధ పడటం లేదు, కానీ ఆయన బాధంతా ఇలాంటి వార్తల వల్ల మేము ఎంత బాధ పడతామో అని ఆలోచిస్తుంటారు. మా నాన్న గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మాకు తెలుసు. మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని ఐశ్వర్య అర్జున్ స్పష్టం చేశారు.

  వాటిని సెక్సువల్ హరాస్మెంట్ అని అనలేం

  వాటిని సెక్సువల్ హరాస్మెంట్ అని అనలేం

  మీటూ ఉద్యమం అనేది ఒక మంచి పరిణామం. దానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఇండియాలో మహిళలపై చాలా దారుణాలు జరుగుతున్నాయి. అలాంటివి బయటకు రావడానికి మీటూ ఉద్యమం అనేది ఒక మంచి సాధనం. నేను అర్జున్ కూతురు అయినప్పటికీ నటిగా సెట్స్‌లో నటిగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయితే వాటికి ‘సెక్సువల్ హరాస్మెంట్' అనే పెద్ద పదాలు మాత్రం వాడను అని ఐశ్వర్య అర్జున్ అన్నారు.

  దీన్ని మీటూ అనడం సరికాదు

  దీన్ని మీటూ అనడం సరికాదు

  సినిమా రంగంలో కొన్ని సీన్లు చేసేపుడు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. హరాస్మెంట్ అయితే నేను చూడలేదు. ఎవరైనా మరొకరిని ఇష్టం లేని పని చేయాలని బలవంతం చేస్తే అది #మీటూ కిందకు వస్తుంది, ఇలాంటివి కాదు.... అని శృతి హరిహరన్ ఆరోపణలను ఉద్దేశించి ఐశ్వర్య అర్జున్ వ్యాఖ్యానించారు. శృతి హరిహరన్ మా నాన్న మీద చేసిన ఆరోపణలు తన పబ్లిసిటీ పెంచుకోవడానికే అని స్పష్ఠమవుతోంది అని అభిప్రాయ పడ్డారు.

  English summary
  Aishwarya Arjun reaction about Sruthi Hariharan allegations against Arjun Sarja. “On what basis has she made this complaint?”asks Aishwarya about actor Sruthi Hariharan calling out her dad on a #MeToo moment. “The #MeToo moment is beautiful and as women, we should support it. I think in India, we need it because there are so many things that are male-dominated,” said Aishwarya. “In my work life, and me being Arjun’s daughter, I faced situations. In fact, I am not taken much into consideration because I am so-and-so’s daughter,” she said.Aishwarya felt ‘sexual harassment’ is a strong word.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X