రజనీకాంత్ కూతురు మోసం చేసింది : నట్టి
రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో, అల్లుడు ధనుష్ హీరోగా రూపొందిన 'త్రీ' చిత్రం తెలుగు హక్కులను కొని నష్ట పోయిన నిర్మాత నట్టి కుమార్...తన ఆరోపణల పర్వం కొనసాగిస్తూనే ఉన్నాడు. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తనను మోసం చేసిందంటూ నట్టి కుమార్ తాజాగా మరోసారి ఆరోపణలకు దిగారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...రూ. 10 లక్షలు విలువ చేసే కొలవెరి డి-3 చిత్రాన్ని ఐశ్వర్య రూ. 10 కోట్లకు పైగా అమ్మిందని మండి పడ్డారు. సినిమా తెలుగు హక్కుల కొనే సమయంలో జరిగిన ఒప్పందాన్ని ఐశ్వర్య, ధనుష్ ఉల్లంఘించారని, అలాంటిది నా వల్లే వారు నష్టపోయారని చెప్పడం అవాస్తవం అన్నారు.
సిఐడి విచారణను తప్పుతోవ పట్టించేందుకే సి కళ్యాన్ తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఫైట్ మాస్టర్ సుందర్ తనపై ఫిర్యాదు చేయడం కళ్యాణ్ ఆడిస్తున్న నాటకమే అని ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలకు ఎలాంటి విచారణకైనా సిద్దమని నట్టి స్పష్టం చేశారు.
సీని రంగాన్ని శాసిస్తున్న అతిరథ మహారథుల బండారం త్వరలోనే బయట పడుతుందని చెప్పి నట్టి...తనకు న్యాయం జరుగకుంటే ఆమరణ దీక్ష చేస్తానని, అవసరం అయితే సుప్రీం కోర్టు వరకు వెలుతానని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. సి కళ్యాణ్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఈ సందర్భంగా నట్టి ఆవేదన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











