వేశ్య పాత్రలో ఐశ్వర్య...

ఓ మోడరన్ మిడిల్ క్లాస్ కుటుంబంలోకి అనుకోకుండా ఓ వేశ్య ప్రవేశిస్తే జరిగే అలజడే ఈ చిత్రం ప్రధాన ఇతి వృత్తం. ఇంతకు ముందు 'బ్రైడ్ అండ్ ప్రెజుడీస్, మిస్ర్టెస్ ఆఫ్ స్పయిసెస్, ప్రొవోక్‌డ్, ది లాస్ట్ లీజియన్' వంటి ఆంగ్ల చిత్రాల్లో నటించిన ఐశ్వర్య ప్రస్తుతం 'ది పింక్ పాంథర్' సీక్వెల్‌లో నటిస్తోంది. దీని తరువాత చారిత్రక నేపథ్యంలో రూపొందిస్తున్న 'సింగులారిటీ' చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. బ్రెండన్ ప్రేజర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం భారత్‌లో జరగనుంది.ఇలా అదీ ఇదీ అని తేడాలేకుండా ఆమె వరస హాలీవుడ్ ఆఫర్స్ లతో దూసుకుపోతోంది.అందుకు కారణం ఆమె అందం,అభినయ సామర్థ్యమే కాకుండా ఎలాంటి పాత్రఅయినా మొహమాట పడకుండా ఒప్పుకుని నిజాయితీగా పనిచేసే గొప్పతనమే అంటున్నారు విశ్లేషకులు.


Click it and Unblock the Notifications











