ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ నేపథ్య గాయని కావాల్సిన అవకాశాన్ని చేజార్చుకుంది. రితిక్ రోషన్ హీరోగా నటించిన జోథా అక్బర్ సినిమాలో ఆమెకు పాట పాడే అవకాశం వచ్చింది. జోథా అక్బర్ చిత్రంలో ఆమె హీరోయినుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఒక పాట పాడాలని అసుతోష్ ఘోష్ ఐశ్వర్యను కోరారట. అయితే తగిన సమయం లేకపోవడంతో ఆమె అందుకు అంగీకరించలేదని సమాచారం. సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహ్మాన్ ఇచ్చిన సమయం ఆమెకు కుదరలేదట. దీంతో ఆమె ఆ అవకాశాన్ని వదులుకుందని అంటున్నారు.