ఐశ్వర్య హాలీవుడ్ చిత్రం త్వరలో..
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ నటించిన హాలీవుడ్ చిత్రం ది మిస్టరీస్ ఆఫ్ స్పైసిస్‌ను త్వరలో ఆంధ్రదేశమంతటా విడుదల కానుంది. ఆర్య ఆర్ట్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం రాష్ట్రంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ సంస్థ అధినేత జాని తెలిపారు.
ది మిస్టరీస్ ఆఫ్ స్పైసిస్ ఒక నవల ఆధారంగా హాలీవుడ్‌లో నిర్మించారు. ఐశ్వర్యరాయ్‌తో పాటు పలువురు భారతీయులు నటించిన ఈ చిత్రం ప్రధానంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలను చాటుతుంది. ఇది రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని జాని తెలియజేశారు.
ది మిస్టరీస్ ఆఫ్ స్పైసిస్ కథ గురించి వివరిస్తూ.. తనను పెంచి పెద్ద చేసిన మంత్రసాని ద్వారా స్పైసిస్‌తో ఆయుర్వేద వైద్యాన్ని అభ్యసించిన ఐశ్వర్యారాయ్ అమెరికాలో ఓ స్పైసిస్ షాప్‌ను నిర్వహిస్తుంటుంది. ఆమెకు సిక్త్స్‌సెన్స్ ద్వారా జరుగబోయే విషయాల గురించి ముందే తెలుస్తుంటుంది. ఇదిలా ఉండగా ఆమె ఓ యువకుడితో ప్రేమలో పడుతుంది. దాంతో ఏకాగ్రతతో చేయాల్సిన వైద్యాన్ని చేయలేకపోతుంది. ఇటు ప్రేమ, అటు వృత్తి... ఈ రెండిటి మధ్యలో ఐశ్వర్యా ఎలా నలిగిపోయింది? ఆమె చివరకు దేనికి ప్రాధాన్యమిచ్చింది? అన్నదే ఈ చిత్ర కథ. హాలీవుడ్‌లో విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది అని జాని అన్నారు. డెర్‌మేడో హీరోగా నటించిన ఈ చిత్రానికి పాల్ మేరిడా దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications