పేలుళ్లుపై ఐశ్వర్యారాయ్ స్పందన
" పేలుళ్ల వార్త విని దిగ్భ్రాంతి చెందాను. బాధితుల కోసం ప్రార్ధన చేస్తున్నా. టెర్రరిస్టులకు భయపడకుండా భారతీయులు సమైక్యంగా ఉండాల్సిన తరుణమిది. వారికి మనం వణకిపోరాదు. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా." అని ఐశ్వర్యారాయ్ చెప్పారు. తన భర్త అభిషేక్ బచ్చన్‌తో కలసి ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి 'నైట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్' అవార్డును ఆమె అందుకోవలసి ఉంది.
కాని పేలుళ్ల వార్త తెలియగానే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. " ఇది ఉత్సవం జరుపుకునే తరుణం కాదు. నేను నా భర్త ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సిందిగా ఫ్రాన్స్ రాయబారిని అభ్యర్దించాం." అని ఆమె తెలిపారు.2008లోనే ఈ అవార్డు ఆమెకు వచ్చినప్పటికీ వ్యక్తిగత కారణాలవల్ల తీసుకోలేకపోయారు." దేవుడా! ముంబయిలో పేలుళ్లా? ప్రజలు క్షేమంగా ఉంటారని ఆశిస్తున్నా." అని అమితాబ్ తన ట్విట్టర్ లో రాశారు.


Click it and Unblock the Notifications











