For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరీ పబ్లిక్ లోనే ముద్దు పెట్టేసుకున్నారు : పెదాలు కలిపి చాలా నోళ్ళు మూయించారు

  |

  మ‌రో సెల‌బ్రిటీ మ్యారేజ్ బంధం బీట‌లు వారుతోందా.? అభిషేక్ బ‌చ్చ‌న్ - ఐశ్వ‌ర్య రాయ్ విడాకుల‌కు రెడీ అవుతున్నారా..? వరుసగా ఇలాంటి హెడ్డింగ్ లతో కథనాలు వెలువడ్డాయి. అభిషెక్ బచ్చన్ ఐశ్వర్యా ఇక విడిపోతున్నట్టే అని గాసిప్ రాయుళ్ళు కంఫర్మ్ చేసేసారు కూడా. ప్రపంచ సుందరి అయినప్పటినుంచీ... ముద్దొచ్చే బిడ్డ ఆరాధ్య కి తల్లి అయ్యేంత వరకూ అశ్వర్య జీవితం లో ఎన్నెన్నో వివాదాలు... మరెన్నో విమర్శలూ అయినా ఆమె ఎప్పుడూ తొణకలేదు. తాజాగా భర్తతో విడాకులు తీసుకుంటోందీ అన్న పుకార్ల పైకూడా ఐష్ కూల్ గానే ఉంది. అసలు ఆ విమర్శలేవీ తమని ఉద్దేశించించినవి కాదూ అన్నట్టు అభిషేక్ అసలు ఈ వ్యవహారం లో పెదవి విప్పలేదు. పెదవి మూసే చాలా నోళ్ళను మూయించారు ఈ జంట...

  ఇప్పటికీ వన్నె తరగని అందం, అభినయంతో అభిమానులను అలరిస్తున్న ఐష్... తాజాగా రణ్‌బీర్‌ కపూర్‌తో 'యే దిల్‌ హై ముష్కిల్‌' సినిమాలో శృంగారం పండించి చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం కారణంగానే బచ్చన్‌ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయని, అభిషేక్‌-ఐష్‌ విడాకులు తీసుకోనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై బచ్చన్ ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరూ స్పందించలేదు. అదేసమయంలో దీపావళి పండుగను పురస్కరించుకుని బాలీవుడ్ నటీనటులకు బచ్చన్ ఫ్యామిలీ మంచి విందు పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో తమపై వచ్చిన పుకార్లకు సమాధానం ఇచ్చారు.

  అభిషేక్‌-ఐష్‌ విడాకులు:

  అభిషేక్‌-ఐష్‌ విడాకులు:

  ఈ అందం నిన్నటితో 43 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఇప్పటికీ వన్నె తరగని అందం, అభినయంతో అభిమానులను అలరిస్తోంది. తాజాగా రణ్‌బీర్‌ కపూర్‌తో ‘యేదిల్‌హైముష్కిల్‌' సినిమాలో శృంగారం పండించి చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం కారణంగానే బచ్చన్‌ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయని, అభిషేక్‌-ఐష్‌ విడాకులు తీసుకోనున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి.

  బ‌చ్చ‌న్ ఫ్యామిలీ కోపం:

  బ‌చ్చ‌న్ ఫ్యామిలీ కోపం:

  రీ ఎంట్రీలో ఐశ్వ‌ర్య రాయ్ ఫుల్ బిజీగా ఉంది. ఇది బ‌చ్చ‌న్ కుటుంబానికి ఏమాత్రం ఇబ్బంది కాదు. కానీ,ర‌ణ్ బీర్ కపూర్ హీరోగా న‌టించిన యే దిల్ హై ముష్కిల్ చిత్రంలో ఆమె చాలా బోల్డ్‌గా న‌టించింది. ఆ పాత్ర మొద‌ట ఐశ్వ‌ర్యకు చెప్పిన‌ప్పుడు చాలా సాధార‌ణ పాత్ర అట‌. కానీ ఆమె పోషించిన పాత్ర‌లో జీవం లేద‌ని, కాస్త మ‌సాలా ద‌ట్టిస్తే అది మ‌రింత పాపుల‌ర్ అవుతుంద‌ని చెప్పి మ‌రీ ఐశ్వ‌ర్య ఆ బోల్డ్‌సీన్స్‌లో న‌టించింద‌ట‌. దీంతో, బ‌చ్చ‌న్ ఫ్యామిలీ ఐశ్వర్య పై కోపంగా ఉందనీ ఇదే ఐష్ అభి ల విదాకుల కారనం అనీ వార్తలు వచ్చాయి.

  ఏ ఒక్కరూ స్పందించలేదు:

  ఏ ఒక్కరూ స్పందించలేదు:

  ఈ వార్తలపై బచ్చన్ ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరూ స్పందించలేదు. అదేసమయంలో దీపావళి పండుగను పురస్కరించుకుని బాలీవుడ్ నటీనటులకు బచ్చన్ ఫ్యామిలీ మంచి విందు పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో తమపై వచ్చిన పుకార్లకు సమాధానం ఇచ్చారు. బహిరంగంగా ముద్దు పెట్టుకుని తమ మధ్య ఎంత అనుబంధం ఉందో చాటారు. ఆ ఫంక్షన్‌లోనే ఐష్‌, అభి బహిరంగంగా ముద్దు పెట్టుకుంటూ ఫోజులిచ్చారు. దీంతో అభి-ఐష్‌ విడిపోనున్నారనే వార్తలకు చెక్‌ పడినట్టే!

  బహిరంగంగా కిస్:

  బహిరంగంగా కిస్:

  ఈ వార్తలపై మౌనం పాటించిన అభిషేక్ ఐశ్వర్య జంట...దీపావళికి ఇచ్చిన పార్టీలో వాటికీ రిప్లయ్ ఇచ్చేసింది. బహిరంగంగా తన భర్త అభిషేక్ కి కిస్ ఇస్తూ తమ రిలేషన్ ఎంత బలమైనదో చాటుకునే ప్రయత్నం చేసింది ఐశ్వర్య. ముంబైలోని అమితాబ్ తన నివాసంలో బాలీవుడ్ సెలబ్రిటీలకు ఆదివారం విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సంజయ్ దత్, రణబీర్ కపూర్, విద్యాబాలన్, ఫర్హాన్ అక్తర్ వంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. ఆ వేడుకలో ఐష్ -అభిషేక్ కిస్ ఇచ్చే సన్నివేశాన్ని తమ కెమెరాల్లో బందించారు కొంతమంది సెలబ్రిటీలు.

  సాఫీగా ఏం సాగలేదు:

  సాఫీగా ఏం సాగలేదు:

  నటి ఐశ్వర్యరాయ్ గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. సినిమాలు, అవార్డులు, ఎండార్స్‌మెంట్లు, కుటుంబ విషయాలు...ఇలా ఆమె తరచూ వార్తల్లో వ్యక్తిగా ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇవి మాత్రమే కాదు...ఐశ్వర్యరాయ్ చుట్టూ పలు వివాదాలు కూడా ఉన్నాయి. ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న తర్వాత సినిమా రంగ ప్రవేశం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఐశ్వర్యరాయ్ ప్రయాణం సాఫీగా ఏం సాగలేదు.

  సల్మాన్ ఖాన్ లాంటి టాప్ స్టార్‌తో ఎఫైర్ :

  సల్మాన్ ఖాన్ లాంటి టాప్ స్టార్‌తో ఎఫైర్ :

  ఎన్నో ఎత్తు పల్లాలు ఆమె జీవితంలో, కెరీర్లో ఎదురయ్యాయి. ఫిల్మ్ ఇండస్టీలో ఆమె టాప్ హీరోయిన్‌గా ఎదగడానికి ఆమె అందం, పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు....వివాదాలు కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. కెరీర్ తొలినాళ్లలో ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ లాంటి టాప్ స్టార్‌తో ఎఫైర్ అప్పట్లో హాట్ టాపిక్. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ శతృవులుగా మారి విడిపోయిన సందర్భం కూడా సెన్సేషన్.

  వివేక్ ఓబెరాయ్:

  వివేక్ ఓబెరాయ్:

  ‘హమ్ దిల్ దే చుకె సనమ్' షూటింగ్ సమయంలో ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్ మధ్య ప్రేమాయణం మొదలైంది. ఆతర్వాత ఇద్దరూ విడిపోయారు. ఐశ్వర్యరాయ్ సల్మాన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. సల్మాన్ తనను శారీరకంగా హింసించాడని ఆమె ఆరోపించింది.అంతే కాదు అదే సందర్భం లో వివేక్ ఓబెరాయ్ వల్ల అయిన గొడవకూడా మామూలుదేం కాదు.

  వివేక్ ఒబెరాయ్ డేటింగ్ :

  వివేక్ ఒబెరాయ్ డేటింగ్ :

  ఐశ్వర్యరాయ్, వివేక్ ఒబెరాయ్ డేటింగ్ చేస్తున్న సమయంలో... సల్మాన్ ఖాన్ నుండి తనకు 41 మిస్డ్ కాల్స్ వచ్చాయని వివేక్ ఒబెరాయ్ మీడియా ముఖంగా ప్రకటించాడు. అయితే వివేక్ ఒబెరాయ్ అలా ప్రకటించడాన్ని ఐశ్వర్యరాయ్ తప్పుబట్టింది.అనవసరంగా రచ్చకీడుస్తున్నవ్ నీ హద్దుల్లో నువ్వుండమన్నట్టుగా నిర్మొహమాటంగా చెప్పేసింది అంతే అప్పుడప్పుడే మొదలవుతున్న వారిద్దరి ప్రేమా అక్కడితోనే ఆగిపోయినట్టు చెప్పుకున్నారు. అసలు మొదలయ్యిందో లేదో అర్థం కాకుండానే షార్ట్ టైం లో ముగిసిందీ ఎఫైర్

  ధూమ్ 2 చిత్రంలో:

  ధూమ్ 2 చిత్రంలో:

  ఆతర్వాత ఈ అందాల రాయ్ వారింటిపిల్ల బచ్చన్ వారి కోడలయ్యాక కూడా ఏదో ఒక నెగెటివ్ వార్త వస్తూనే ఉంది. ధూమ్ 2 చిత్రంలో ఐశ్వర్యరాయ్, హృతిక్ రోషన్ మధ్య హాట్ హాట్ కిస్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా విడుదలయ్యే నాటికి ఐశ్వర్య-అభిషేక్ పెళ్లి ఫిక్సయింది. దీంతో ఈ ముద్దు సీన్‌పై బచ్చన్ కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. పెళ్ళి అయ్యాక కూడా అభిషేక్ తలి జయ బచన్ కీ ఐష్వర్యకీ పడటం లేదనీ విడాకులు తీసుకోబోతున్నారనీ చెప్పుకున్నారు.

  ధూమ్ 2 చిత్రంలో:

  ధూమ్ 2 చిత్రంలో:

  10.ఇప్పుడు తాజాగా ఏ దిల్ హై ముష్కిల్ లో రణ్ బీర్ తో మరీ క్లోజ్ గా ఉండే సీన్లతో ఇంట్లో గొడవలయ్యాయనీ ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ చెప్పటం మొదలయ్యింది. అయితే ఆ నోళ్లని నోటితోనే మూయించాలనుకున్నారేమో అటి అశ్వర్య కానీ ఇటు అభిషేక్ గానీ ఎక్కడా ఈ విశయం పై మాట్లాడలేదు.

  అభి-ఐష్‌:

  అభి-ఐష్‌:

  నిన్న అందరి ముందూ ఐష్ ని ముద్దుపెట్టుకొని ఈ వార్తలకు చెక్ పెట్టేసాడు చోటా బచ్చన్. బహిరంగంగా ముద్దు పెట్టుకుని తమ మధ్య ఎంత అనుబంధం ఉందో చాటారు. ఆ ఫంక్షన్‌లోనే ఐష్‌, అభి బహిరంగంగా ముద్దు పెట్టుకుంటూ ఫోజులిచ్చారు. దీంతో అభి-ఐష్‌ విడిపోనున్నారనే వార్తలకు చెక్‌ పడినట్టే!

  English summary
  Aishwarya Rai Bachchan and Abhishek Bachchan share a private moment at the Diwali party hosted by them.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X