ఐశ్వర్యరాయ్ కూతురు పేరు ఖరారైనట్లే

ఐశ్వర్య దంపతులు AA అని ఆలోచించడం వెనక పెద్ద కారణమే ఉంది. ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్ ఇలా కుటుంబంలోని వారి పేర్లన్నీ A అక్షరంతోనే మొదలవుతుండటం, AA అని పెడితే జాతక పరంగా కూడా ఐశ్వర్య కూతురుకు కలిసొస్తుందని బచ్చన్ కుటుంబం బలంగా నమ్ముతోందని అంటున్నారు. త్వరలోనే పేరును ఖరారు చేసి సోషల్ నెట్వర్కింగ్ ద్వారా అభిమానులకు, మీడియాకు తెలియజేసే అవకాశం ఉంది.
నవంబర్ 16, 2011న ఐశ్వర్య పండంటి బిడ్డకు జన్మనివ్వడం, ప్రస్తుతం ఆమెను 'బేటి బి' అని ముద్దుగా పిలుచుకుంటున్న విసయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐశ్వర్య కూతురు మీడియా కంట పడలేదు. సరైన సమయంలో బేటి బి ఫోటోలను మీడియాకు విడుదల చేస్తామని బచ్చన్ కుటుంబ సభ్యులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











