ఐశ్వర్య తన భర్తతో కలిసి సీక్రెట్‌గా...
బాలీవుడ్ స్టార్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ బుధవారం రాత్రి సీక్రెట్ గా ఓ పార్టీకి హాజరయింది. ప్రస్తుతం గర్భంతో ఉన్న ఐశ్వర్య కోసం ఆమె సన్నిహితులైన డిజైనర్స్ అబూజానీ, సందీప్ కోస్లాలు బాంద్రాలోని సీమంతం(బేబీ షవర్ పార్టీ) పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. త్వరలో ఐష్ పండంటి కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో బచ్చన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలకాలం గుర్తుండి పోయే వేడుక చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ పార్టీని ఏర్పాటు చేశారట. సాంప్రదాయ బద్దంగా పార్టీని ఏర్పాటు చేయడంతో పాటు, నార్త్ ఇండియా...సౌతిండియా వంటకాలతో వంటలు అదర గొట్టారు.
కాగా...ఐశ్వర్య రాయ్ గర్భవతి అయిన నేపథ్యంలో బెట్టింగ్ ఇప్పటికీ జోరుగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆమెకు కవల పిల్లలు, ఆడ బిడ్డ, మగ బిడ్డ అనే అంశాలతో పాటు, ఐశ్వర్య ఎప్పుడు ప్రసవిస్తుంది అనే దానిపై కూడా పందెం రాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటూ పందేలు కాస్తున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పందెం రాయుళ్లు....ఐష్ బిడ్డకు జన్మనిచ్చే రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











