జూ. బచ్చన్ కోసం చాలా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాం: బచ్చన్
అందాల సుందరి ఐశ్వర్యరాయ్ ప్రస్తుతం ఐష్ గర్భవతి అన్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ ఆమె నటించిన సినిమాలు గురించిన మాట్లాడుకున్నవాళ్లు ఇప్పుడు ఆమె జన్మనివ్వబోతున్న బిడ్డ గురించి చర్చించుకుంటున్నారు. బచ్చన్ కుటుంబం మాత్రం తమ కుటుంబం జాబితాలో చేరబోయే బిడ్డ కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. అమితాబచ్చన్, ఆయన సతీమణి జయాబచ్చన్ తమ కోడల్ని అపురూపంగా చూసుకుంటున్నారట.
ఐశ్వర్య రాయ్ డెలివరీ కోసం హాస్పటల్లో అడ్మింట్ అయ్యిందనే వార్త ప్రస్తుతానికి హాట్ టాపిక్. ఎప్పుడెప్పుడు ఐష్ డెలివరీ అవుతుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. నిన్న రాత్రి ఐశ్వర్య రాయ్ ముంబాయ్ లోని సెవన్ హిల్స్ హాస్పటల్ కి వెళ్ళిందని సమాచారం. ఆమెతో పాటు అభిషేక్ బచ్చన్ కూడా ఉన్నాడు. డెలివరీ కోసం అడ్మిట్ అవ్వడానికే ఐష్ హాస్పటల్ కి వెళ్ళిందని, ఏ క్షణమైనా ఐష్ డెలివరీ అయిన మ్యాటర్ బయటకి వచ్చే అవకాశముందనే వార్తలు జోరుగా సాగుతున్నాయి.
కాగా కుటుంబంలోని బందువులందారు ఒక చోట చేరి జూ బచ్చన్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు అమితాబ్ బచ్చన్ రీసెంట్ గా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











