సెక్సీగా తయారవ్వడమే లక్ష్యంగా ఐశ్వర్యరాయ్ పాట్లు!
మహిళలు గర్భం ధరించి, బిడ్డకు జన్మిస్తే కాస్త లావెక్కి.....అంతకు ముందు ఉండే సెక్సీ ఫిగర్ ను కోల్పోతారనే విషయం తెలిసిందే. తాజాగా ఐశ్వర్య రాయ్ విషయంలోనూ అదే జరిగింది. ఇటీవలే పండండి పాపాయికి జన్మిచ్చిన ఐష్, కాస్త లావెక్కి బొద్దుగా మారింది. ప్రస్తుతం ఆమె ఉన్న స్థితి హీరోయిన్ గా సెట్ కాదు. ఈ నేపథ్యంలో మళ్లీ హీరోయిన్ గా రాణించాలని చూస్తున్న ఐశ్వర్య రాయ్ స్లిమ్ గా, సెక్సీగా తయారయ్యేందుకు సమాయత్తం అవుతోంది. మరో వైపు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ నుంచి సినిమా ఆఫర్ కూడా రావడంతో...వీలైనంత త్వరగా తన ఫిగర్ షేపును మార్చుకోవాలని నిర్ణయించుకుందట. ఈ మేరకు మళ్లీ డైటింగులు, ఎక్స్ సైజులు మొదలు పెట్టినట్లు బాలీవుడ్ సమాచారం.
ఇటీవలే ఐశ్వర్యను కలసిన సంజయ్‌లీలా భన్సాలీ హీరోయిన్ ఓరియెంటడ్ కథ చెప్పినట్లు, ఐశ్వర్య కూడా ఆ సబ్జెక్ట్‌ను ఓకే చేసిందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదనకు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఈ ఇద్దరి కలయికలో 'హమ్ దిల్ దే చుకే సనమ్, దేవ్‌దాస్, గుజారిష్ లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











