బచ్చన్ హౌస్ జాల్సాలో ఐష్ శ్రీమంతపు వేడుకలు..!
ఐష్ ప్రెగ్నెన్సీ అయిన దగ్గరనుంచీ బిగ్ బీ ఫ్యామిలీ ఆనందోత్సాహాల్లో మునిగితేలుతుంది. అభిషేక్ ఐతే ఇక తన వైఫ్ ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఇంకో నెల రోజుల్లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న ఐష్ కు తన అత్తగారు జయాబచ్చన్ సీమంతం వేడుకను ఫుల్ గ్రాండ్ గా నిర్వహించారు. బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ఐశ్వర్యారాయ్ శ్రీమంతం వేడుకలు ముంబైలోని బచ్చన్ల నివాసం జల్సా లో వైభవంగా జరిగాయి..ఈ వేడుకలకు బచ్చన్ ఫ్యామిలీ ప్రెండ్స్ తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు.. దీంతో బచ్చన్ల నివాసం సెలబ్రిటీలతో సందడిగా మారింది. గెస్ట్ లందరికీ గిఫ్ట్స్ అందించి బచ్చన్ ఫ్యామిలీ ఖుషీలో మునిగితేలింది.
బిగ్ బీ ఫ్యామిలీ ఫుల్ ట్రెడిషనల్. ప్రతి అకేషన్ ను వారు చాలా గ్రాండ్ గా నిర్వహిస్తుంటారు అమితాబ్ దంపతులు. ఇక తమ ముద్దుల కోడలు ఐశ్వర్య శ్రీమంతం వేడుకను ధూమ్ ధామ్ గా చేసారని విశ్వనియ వర్గాల నుండి అందిన సమాచారం. ఈ వేడుక కోసం స్పెషల్ డ్యాన్స్ లు, సింగింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటుచేశారు. ఇక ఐష్ కోసం జయాబచ్చన్ ప్రత్యేక జ్యూయలరీతో పాటు డిజైనర్ వేర్ డ్రెస్సులను తయారుచేయించారు. తన ముద్దుల మనవడో, మనవరాలి రాక కోసం బిగ్ బీ దంపతులు ఇప్పటికే బోలెడన్ని బొమ్మలు కూడా కొనేశారట. అమితాబ్ కూతురు శ్వేతా నందా ఈ వేడుక వ్యవహారాలను దగ్గరుండి చూసుకున్నారట.
తన లైఫ్ పార్టనర్ కోసం అభిషేక్ షూటింగ్ లను సైతం పక్కనపెట్టాడు. బోల్ బచ్చన్ చిత్రం షూటింగ్ కోసం గత 50 రోజులుగా జైపూర్ లో ఉన్న అభిషేక్ ...ఈ వేడుక కోసం రెండురోజుల క్రితమే ముంబయి చేరుకున్నాడు. అత్తమామలు,భర్త తనపై చూపిస్తున్న ప్రేమకు ఐష్ ఐతే ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఐష్ కూడా తనకు పుట్టబోయే బిడ్డ కోసం బోలెడన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఐష్ కు ట్విన్స్ అని ఇప్పటికే బాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఐష్ డెలివరీ డేట్ పై ఇప్పుడు భారీగా బెట్టింగ్ లు జరగుతున్నాయి. వచ్చే నెల 11 న ఆమె బిడ్డకు జన్మనిస్తే...11-11-2011 అవుతుంది కాబట్టి..ఆ రోజే ఆమె తల్లి అవుతుందని బెట్టింగ్ కడుతున్నారట. ఇక నవంబర్ 14 చిల్ర్డన్స్ డే రోజున ఐష్ కు డెలివరీ అవుతుందని మరికొంతమంది వాదన. ఈ రెండు రోజులు ప్రత్యేకమైన రోజులు కాబట్టి ఐష్ ఈ డేట్స్ లోనే డెలివరీ ఐతే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికి ఐష్ డెలివరీ ఎప్పుడవుతుందో తెలియదు కానీ ఆమెపైన బోలెడంత బెట్టింగ్ జరుగుతుంది.


Click it and Unblock the Notifications











