Divorce అభిషేక్‌ బచ్చన్‌తో విడాకులు.. ఒక్క పోస్ట్‌తో తేల్చిపడేసిన ఐశ్వర్య రాయ్

బాలీవుడ్‌లో కొద్దికాలంగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకొంటున్నారనే వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. అయితే ఈ రూమర్లు కొద్దికాలంగా అభిమానులను కంగారు పెడుతున్నది. అయితే విడాకుల వార్తపై అటు బిగ్‌బీ ఫ్యామిలీ గానీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ గానీ క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఈ వార్తపై అనేక సందేహాలు, అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే విడాకుల వ్యవహరంపై ఐశ్వర్య ఒక్క పోస్టుతో తేల్చిపడేసింది. ఐశ్వర్య రాయ్ ఇచ్చిన క్లారిటీ విషయానికి వస్తే..

ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకొంటున్నాయనే వార్తల మధ్య వారిద్దరూ కలిసి కనిపిస్తున్నారు. అనేక ఈవెంట్లలో కలిసి పాల్గొంటున్నారు. అలాగే వారిద్దరూ ఫ్యామిలీ ఈవెంట్స్‌కు కూడా హాజరవుతున్నారు. అయితే వారి మధ్య వైవాహిక పరంగా విభేదాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తాయి.

aishwarya-rai-bachchan

Recommended Video

Divorce విషయంపై Clarity ఇచ్చిన Aishwarya Rai | Filmibeat Telugu

ఐశ్వర్య రాయ్‌తో విభేదాల నేపథ్యంలో అభిషేక్ బచ్చన్ తన జన్మదినాన్ని జరుపుకొన్నాడు. ఫిబ్రవరి 5వ తేదీన 48 ఏళ్లు పూర్తి చేసుకొని 49వ ఏట ప్రవేశించాడు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాయ్, ఆరాథ్యతో కలిసి తన పుట్టిన రోజును జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తమ ఫ్యామిలీ ఫోటోను ఐశ్వర్య రాయ్ షేర్ చేసింది.

ఐశ్వర్య రాయ్ తమ ముగ్గురి ఫోటోను షేర్ భావోద్వేగమైన సందేశాన్ని తన భర్తకు అందజేసింది. ఆ సందేశంతోపాటు ఐశ్వర్యతోపాటు అభిషేక్, ఆరాధ్య ఉన్న రెండు ఫోటోలను షేర్ చేసింది. వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఐశ్వర్యరాయ్ తన భర్తకు బర్త్ డే శుభాకాంక్షలు అందిస్తూ.. హ్యాపీ బర్త్ డే అంటూ ఇంద్రధనుస్సు ఇమేజీలను పెట్టి.. జీవితాంతం సంతోషంగా, ప్రేమతో, మనశ్శాంతి, ఆరోగ్యంతో గడపాలని దేవుడిని కోరుకొన్నది. దాంతో వారి మధ్య విడాకులు, విభేదాల సమస్య లేదని డైరెక్ట్‌గా తేల్చేసింది. అంతేకాకుండా డైవోర్స్ రూమర్లకు తెరదించింది అని నెటిజన్లు కామెంట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X