ఐష్-అభిలకు ట్విన్స్....!?ఆనందోత్సాహంతో బచ్చన్ ఫ్యామిలీ...!?
అందాల ఐశ్వర్యా రాయ్ తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఇందు కోసమే మధూర్ బండార్కర్ తెరకెక్కించనున్న 'హీరోయిన్" చిత్రం నుంచి తప్పుకున్న ఈ అందాల రాశి చాలా కాలంగా పిల్లల కోసం తపించిన బచ్చన్ కుటుంబానికి ఒక్కరుకాదు ఒకే కాన్పులో ఏకంగా ఇద్దరు పిల్లలకు జన్మనివ్వబోతోంది. డాక్టర్లు నవంబర్ లో డెలివరీ డేట్ ఇచ్చారు. దీంతో బచ్చన్ కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటబోతున్నాయి.
ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ' ఐశ్వర్య ఇద్దరు పిల్లలకు జన్మనివ్వబోతుండటం చాలా ఆనందంగా వుంది. పుట్టబోయేది ఆడిపిల్లలయినా, మగపిల్లలైనా ఇద్దరుంటే చాలని ప్రసుత్తం అంతా అనుకుంటున్నాం కాబట్టి ఐష్ మరోసారి గర్భం దాల్చాల్సిన అవసరంలేదని. అభిషేక్ మాటలు ఇలా వుంటే బాలీవుడ్ వర్గాలు మాత్రం మరో సారి గర్భందాల్చే అవసరం లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒకే కాన్పులో కవలలు జన్మించేలా ఐశ్వర్య కోసం అభిషేక్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడని చెబుతుండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











