పిక్చర్స్: అందాలతో అదరగొట్టిన ఐశ్వర్యా రాయ్
ముంబై: పిల్ల తల్లి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ఓ చారిటీ కార్యక్రమంలో తన అందాలతో అదరగొట్టింది. ఇటీవల కేన్స్ ఫెస్టివల్‌లో ప్రత్యేకార్షణగా నిలిచిన ఐశ్వర్యా రాయ్ రాబర్టో చావలి ఏర్పాటు చేసిన ప్రత్యేక చారిటీ కార్యక్రమంలో పాలు పంచుకుంది. ఐరోపాలో అతి పెద్ద చారిటి ఈవెంట్ లైఫ్ బాల్ చారిటీ. ఆ కార్యక్రమంలో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగింది.
ఈ చారిటీ కార్యక్రమంలో రాబర్టో చావలి స్వయంగా రూపొందించిన నీలం రంగు గౌను ధరించి ఐశ్వర్యా రాయ్ స్లిమ్‌గా కనిపించింది. చారిటీ కార్యక్రమం తర్వాత హై ప్రొఫెల్ ఫ్యాషన్ షో జరిగింది. కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యా రాయ్ పాశ్చాత్య, దేశీయ దుస్తులు ధరించి కనువిందు చేసింది. అయితే, ఇందుకు ఆమె ప్రశంసలతో పాటు విమర్శలను కూడా ఎదుర్కుంది.
కేన్స్ ఫెస్టివల్‌లో ఆమె కనిపించడం ఇది 12వ సారి. సంజయ్ లీలా బన్సాలి దేవదాస్ ప్రీమీయర్ సందర్భంగా ఐశ్వర్యా రాయ్ కేన్స్‌లో తొలిసారి పాల్గొంది. ఈసారి కేన్స్ ఫెస్టివల్‌కు ఆమెతో పాటు కూతురు ఆరాధ్య, తల్లి వృందా రాయ్ ఉన్నారు.

ఐశ్వర్యా రాయ్ బచన్ ఇటీవల లైఫ్ బాల్ చారిటీ పేర నిర్వహించిన ప్రత్యేక చారిటీ కార్యక్రమంలో పాల్గొన్నది.

చారిటీ కార్యక్రమానికి ముందు ఐశ్వర్య కేన్స్ ఫెస్టివల్‌లో పాల్గొంది. పాశ్చాత్య, భారత సంప్రదాయ దుస్తుల్లో ఆమె అలరించింది.

ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కేన్స్ ఫెస్టివల్‌లో భారతీయ దుస్తుల్లో ఇలా..

అబూ జానీ - సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన గౌనులో ఐశ్వర్యా రాయ్ బచ్చన్

ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి ఐశ్వర్యా చాలా బరువు తగ్గింది.

నల్లటి, బంగారు ఎంబ్రాయిడరీతో కూడిన సవ్యసాచి లంగా, చీరల్లో కనువిందు చేస్తూ ఐశ్వర్యా రాయ్

ఐశ్వర్యా రాయ్ రెడ్ కార్పెట్ వద్ద ఇలా..

ఐశ్వర్యా రాయ్ ఇలా కూడా...


Click it and Unblock the Notifications











