ఐశ్వర్యకు అంత ఆరాటం ఎందుకు?
ఐశ్వర్యరాయ్ కి అంత ఆరాటం ఎందుకు? అంటూ ప్రస్తుతం బాలీవుడ్ జనాలంతా రుసరుసలాడుతున్నారు. డెలివరీ అయి కనీసం నెల రోజులు కూడా పూర్తి కాలేదు అప్పుడే సినిమాల్లో నటించడంపై ఐశ్వర్య దృష్టి పెట్టడమే ఇందుకు కారణం. సంజయ్ లీలా బన్సాలీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు...జిమ్ముల్లో షేపులు మారిన తన శరీరాన్ని మళ్లీ సెక్సీగా తయారు చేసుకోవడం కసరత్తులు ప్రారంభించింది ఐశ్వర్య.
బాలీవుడ్ లో పెళ్లయి తల్లయిన తర్వాత సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. మాధురీ దీక్షిత్, కాజోల్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా హీరోయిన్లుగా రాణిస్తున్న వారే. అయితే ఇంత త్వరగా మాత్రం కాదు. పిల్లలు పుట్టాక ఐదేళ్లకు మాధురి 'ఆజా నచ్ లె' చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇస్తే...దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని కాజోల్ 'ఫనా'సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
అయితే వీరి రికార్డును బద్దలు కొట్టాలనే ఉద్దేశ్యంతోనే ఐశ్వర్య ఇంత ఆరాట పడుతోందని...ఆమెకు ఇల్లు, పిల్లులు, సంసారంపై కంటే తన పేరు, ఫేమ్ పైనే ఎక్కువ ప్రేమ అని, అందుకే ఇంత ఆరాట పడుతోందని అంటున్నారు. అయితే ఐశ్వర్య సన్నిహితులు మాత్రం ఐశ్వర్య మరో ఏడాది వరకు సినిమాల్లో నటించే అవకాశాలు లేవని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











