»   » అభినే ఎందుకు పెళ్లి చేసుకొన్నానంటే... : ఐశ్వర్యారాయ్

అభినే ఎందుకు పెళ్లి చేసుకొన్నానంటే... : ఐశ్వర్యారాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : పెళ్లయిన ఆరేళ్ల తరవాత ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది ఐశ్వర్యారాయ్. అభిషేక్‌ బచ్చన్‌నే ఆమె ఎందుకు పెళ్లి చేసుకొన్నారో తెలిపారు. అతను ప్రేమించిన తీరే నచ్చిందంటూ అందుకే మారు మాట్లాడుకుండా పెళ్లి చేసుకున్నానని చెప్పింది. ఈ విషయం చెప్తున్నప్పుడు ఆమె చాలా చిరునవ్వుతో ఓ రకమైన ఆనందాన్ని అనుభవిస్తూ చెప్పింది.

  ఐష్‌ చెబుతూ ''మామూలుగా అమ్మాయిల్ని ప్రేమలో దింపడానికి అబ్బాయిలు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. తమవైపు అమ్మాయిల దృష్టి మరలేలా ఈలలు వేయడం, గోల చేయడంతోపాటు ఎన్నో తంటాలు పడుతుంటారు. కానీ ఇవేవీ అభి చేయలేదు. అదే నాకు నచ్చింది. ఎంతసేపూ తనదైన హావభావాల్ని ప్రదర్శించేవాడు. నాకు అతని ప్రేమ సులువుగా అర్థమైంది. తరవాత అతనితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన వాడే పదాలు, భావవ్యక్తీకరణ నన్ను ఎంతగానో ఆకట్టుకొన్నాయి. అందుకే అభినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నా. ఆ తరవాత సంగతులు మీకు ఎలాగూ తెలుసు. ఇప్పుడు ఆరాధ్య మా ఇద్దరి లోకం. త్వరలోనే నా అభిమానుల్ని వెండి తెరపై అలరించేందుకు సిద్ధమవుతున్నాను''అని తెలిపారు.

  అభి చెబుతూ ''ఐశ్వర్య బాగా వంట చేస్తుంది. పెళ్లయిన కొత్తలో అనుకుంటాను... ఆమె చేసిన ఓ రకమైన స్వీటు, హల్వా లొట్టలేసుకుంటూ తిన్నాను. బహుశా ప్రేమతో చేసిన వంటకాలు అంతే రుచిగా ఉంటాయేమో'' అని సరదాగా చెప్పారు.


  నిజ జీవిత భార్యా భర్తలు అయిన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య కలిసి ఓ చిత్రంలో నటించే అవకాశాలునున్నట్లు బాలీవుడ్ సమాచారం. అదీ ఓ రీమేక్ అని తెలుస్తోంది. వివాహం జరిగిన చాలాకాలం తర్వాత ఈ జంట ఓ రీమేక్ చిత్రంలో నటించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. గతంలో శేఖర్ కపూర్ నిర్మించిన 'మసూమ్'ను అభి, ఐశ్వర్యలతో తిరిగి నిర్మించాలని హిమేష్ రేషమ్మియా అనే నిర్మాత ప్రయత్నిస్తున్నట్లు, జాతీయ అవార్డు గ్రహీత బేదబ్రతను ఇప్పటికే సంప్రదించినట్లు సమాచారం.

  అలనాటి 'మసూమ్'లో నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ పోషించిన పాత్రలకు అభిషేక్, ఐశ్వర్యలను ఎంపిక చేసి, రీమేక్ హక్కుల కోసం నిర్మాత ప్రయత్నాలు మొదలుపెట్టారట. ప్రముఖ రచయిత గుల్జార్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, పాటలు సమకూర్చనున్నట్లు, అమితాబ్ కుటుంబం నుంచి 'గ్రీన్ సిగ్నల్' లభించిన వెంటనే షూటింగ్ ప్రారంభమవుతుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

  English summary
  Abhishek Bachchan said his wife Aishwarya Rai Bachchan is the beautiful woman but he had never whistled at her but courted her through his gestures, emotions, and words. "I am used to people whistling at my wife... see my wife then you will know why I am saying this.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more