ఐశ్వర్య రాయ్ కూతురు ఫోటో ఇదేనా?
అందాల తార ఐశ్వర్య కాన్పు గురించి గత కొన్ని నెలలుగా యావత్ భారతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. 11-11-11 ఐశ్వర్య బిడ్డకు జన్మనిస్తుందని అంతా ఊహించినా...ఎట్టకేలకు నవంబర్ 16న ఐశ్వర్య ప్రసవించింది. అయితే ఇప్పటి వరకు ఐశ్వర్య బేబీ ఫోటో అధికారికంగా బయటకు విడుదల కాలేదు. ఇంటర్నెట్ లో, ఫేస్ బుక్ లో మాత్రం ఇదే ఐశ్వర్య బేబీ ఫోటో అంటూ దర్శనం ఇస్తోంది. మరి ఇది నిజమైన ఫోటోనా? లేక మార్ఫింగ్ ఫోటోనా? అనేది తేలాల్సి ఉంది.
ఐశ్వర్య ప్రసవంతో బచ్చన్ కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. బిగ్ బి తన మనవరాలిని చూసి తెగ పొంగి పోతున్నాడు. ఇక అభిషేక్ ఆనందానికి అవధులే లేవు. ఈ పాప మరో ఐశ్వర్య రాయ్ అవుతుందని ఇప్పటి నుంచే జ్యోతిష్యులు, న్యూమరాలజిస్టులు లెక్కవేసి చెప్పడంతో బచ్చన్ సన్నిహితులు, అభిమానులు హ్యాపీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











