దాపరికాల్లేవ్ : బిడ్డతో ఐశ్వర్య పబ్లిక్ అప్పియరెన్స్(ఫోటోలు)
ముంబై : ఐశ్వర్య గర్భం దాల్చినప్పటి నుంచి ఆరాధ్యకు జన్మనిచ్చిన తర్వాత కూడా చాలా కాలం వరకు బచ్చన్స్ ఫ్యామిలీ దాడుగుమూతల గేమ్ ఆడిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల వరకు అసలు ఆరాధ్య ముఖాన్ని మీడియాకు కూడా చూపించలేదు. అయితే ఆ దాపరికాలకు బచ్చన్ ఫ్యామిలీ స్వస్తి చెప్పింది. ఇటీవల భోపాల్ వచ్చిన బచ్చన్ ఫ్యామిలీ ఆరాధ్యకు ఎలాంటి ముసుగు వేయకుండా అందరికీ కనిపించేలా చేసారు.
బేబీ ఆరాధ్యను భోపాల్ లోని ఆమె గ్రేట్ గ్రాండ్ మదర్(జయా బచ్చన్ తల్లి)కు చూపించేందుకు తీసుకువచ్చారు. సత్యాగ్రహ షూటింగ్ ఉండటంతో అమితాబ్ కూడా వారితో పాటు భోపాల్ వచ్చారు. 'భోపాల్ లో సత్యాగ్రహ మూవీ షూటింగ్ జరుగుతోంది. ప్రకాష్ ఝా దర్శకత్వంతో అజయ్ దేవగన్, కరీనా కపూర్, అర్జున్ రాంపాల్, మనోజ్ బాజ్ పాయ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ నటిస్తున్నారు. పవర్ ఫుల్ సబ్జెక్ట్' అంటూ అమితాబ్ తన బ్లాగులో పేర్కొన్నారు.
'నాతో పాటు విమానంలో ఐశ్వర్య, అభిషేక్, చిట్టి తల్లి ఆరాధ్య కూడా వచ్చారు. వారంతా జయా బచ్చన్ మదర్‌ను కలిసారు. అదే విధంగా జయ సిస్టర్ ఫ్యామిలీని కూడా కలిసారు. ఆ ముగ్గురు సాయంత్రం తిరిగి ముంబై వెళతారు' అంటూ అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. అందుకు సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేద్దాం...

భోపాల్ లో ఐశ్వర్య, ఆరాధ్య, అభిషేక్

భోపాల్ లో అమితాబ్ బచ్చన్

క్యూట్ లుక్ తో ఆరాధ్య

ఆరాధ్య బచ్చన్ తన గ్రేట్ గ్రాండ్ మదర్ ను కలవడానికి భోపాల్ వచ్చింది.

ఆరాధ్యతో కలిసి ఐశ్వర్య

సత్యాగ్రహ షూటింగ్ ఉండటంతో అమితాబ్ కూడా భోపాల్ చేరుకున్నారు.


Click it and Unblock the Notifications











