విషాదం: ఐశ్వర్యరాయ్ ఫోటోస్ వైరల్, భగ్గమన్న అలియా భట్ సోదరి!

తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడానికి చమర్చిన కళ్లతో హాజరైన ఐశ్వర్యరాయ్ ఫోటోస్ సోషల్ మీడియాలో ఇపుడు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలపై బాలీవుడ్ యువ హీరోయిన్ అలియా భట్ సోదరి షాహీన్ భట్ భగ్గుమంది.

By Bojja Kumar

ముంబై: ప్రముఖ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ తండ్రి కృష్ణ రాయ్ మరణంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడానికి చమర్చిన కళ్లతో హాజరైన ఐశ్వర్యరాయ్ ఫోటోస్ సోషల్ మీడియాలో ఇపుడు వైరల్ అయ్యాయి.

అయితే ఈ ఫోటోలపై బాలీవుడ్ యువ హీరోయిన్ అలియా భట్ సోదరి షాహీన్ భట్ భగ్గుమంది. ఈ ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్లపై మండి పడుతూ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్టు చేసింది. ఓ వైపు అందరూ విషాదంలో ఉంటే ఫోటోగ్రాఫర్లు ఫోటోల కోసం హడావుడి చేయడాన్ని తప్పుబట్టింది.

మరింత బాధ పెడుతోంది

మరింత బాధ పెడుతోంది

మీడియా వారు హై ప్రొఫైల్ వ్యక్తులు, కుటుంబాల్లో జరిగే అంత్యక్రియలను ఎందుకు హైప్ చేసి చూపిస్తారో అర్థం కాదు. వారంతా విషాదంలో ఉంటే పోటీ పడి ఫోటోలు తీసుకుంటారు. మరణం అనేది ఎంతో బాధాకరమైనది. మీరు ఫోటోలు సోషల్ మీడియాలో సర్య్కూలేట్ అయి మరింత మందిని బాధ పెడుతోంది అని షాహీన్ అన్నారు.

 అలాంటివి ఎవరైనా ఎందుకు చూడాలనుకుంటారు?

అలాంటివి ఎవరైనా ఎందుకు చూడాలనుకుంటారు?

ఇలాంటి బాధాకరమైన సంఘటనలకు సంబంధించిన ఫోటోలు చూడాలని ఎవరూ కోరుకోరు. ముఖ్యంగా వారు అభిమానించే స్టార్స్ తమ పేరెంట్స్ ను కోల్పోయి ఏడుస్తుంటే చూడాలని ఏ అభిమాని కోరుకోరు అని షాహీన్ పేర్కొన్నారు.

దీన్ని ఓ పార్టీలా ట్రీట్ చేయడం సరికాదు

దీన్ని ఓ పార్టీలా ట్రీట్ చేయడం సరికాదు

ఫోటో గ్రాఫర్ల అత్యుత్సాహం చూస్తుంటే వారు ఈ విషాదాన్ని ఓ వేడుకలా ట్రీట్ చేస్తున్నట్లే కనిపించింది. విషాద సంఘటనలను అలా ట్రీట్ చేయడం సరికాదు.... అంటూ షామీన్ తనదైన రీతిలో విమర్శలు చేసింది.

కృష్ణరాయ్‌కి బిగ్ బి నివాళి

కృష్ణరాయ్‌కి బిగ్ బి నివాళి

ఐశ్వర్యారాయ్ తండ్రి కృష్ణ రాయ్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన వీయంకుడు, ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్.

బిగ్ బి ట్వీట్

బిగ్ బి ట్వీట్

కృష్ణ రాయ్ మరణం నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... Death has but one end .. and words cannot define it ..!! అంటూ ట్వీట్ చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X