రీఎంట్రీపై నోరు విప్పిన ఐశ్వర్యరాయ్
అందాల సుందరి ఐశ్వర్యరాయ్ బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే అభిమానులంతా ఆమె మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె ప్రసవించిన నెల రోజుల తర్వాత నుంచే ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీపై రకరకాల వార్తలు వినిపించాయి. సంజయ్ లీలా దర్శకత్వంతో పాటు మరికొందరికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ప్రచారం జరిగింది. అయితే ఐశ్వర్యరాయ్ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి స్పందన కనబర్చలేదు.
అయితే ఎట్టకేలకు ఐశ్వర్య తన రీ ఎంట్రీపై నోరు విప్పింది. ముంబైలో ఓ టెలివిజన్ షోకు హాజరైన ఆమె మాట్లాడుతూ...నటనకు స్వస్తి చెప్పాలనే ఆలోచన తనకు ఇప్పటి వరకు లేదని, తప్పకుండా వస్తాను, అయితే అది ఎప్పుడో చెప్పలేను అని స్పష్టం చేసింది. ఆర్నెళ్ల సమయాన్ని పూర్తిగా మా అమ్మాయి కోసమే కేటాయించాలనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ తర్వాత నాలో చాలా మార్పులు వచ్చాయి. మునుపటి శరీర సౌష్టవం రావాలంటే చాలా కష్ట పడాలి, అందుకు చాలా సమయం పడుతుంది అని చెప్పుకొచ్చింది ఐశ్వర్చ. ఈ షోలో ఆమెతో పాటు పాల్గొన్న అభిషేక్ మాట్లాడుతూ...ఐష్ అభిమానుల్లో నేను ఒకడిని, ఆమెను మళ్లీ సినిమాల్లో చూడాలని ఉందన్నారు.


Click it and Unblock the Notifications











