ఫోటోలు: బ్లూలో ఐష్ మైండ్ బ్లోయింగ్ కాన్స్
ముంబై : కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హాట్ ఫేవరెట్ బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యరాయ్ 7వ రోజు బ్లూ డ్రెస్‌లో అందాల దేవతలా దర్శనం ఇచ్చింది. ఈ మోడ్రన్ డ్రెస్సులో ఆమె దివి నుంచి భువికి దిగి వచ్చిన సుందరిలా అందరినీ ఆకట్టుకుంది. ప్రెగ్నెన్సీ తర్వాత బరు పెరిగిందనే విమర్శలకు....తన సెక్సీ అవతారంతో చెక్ పెట్టింది ఐశ్వర్య.
'క్లియోపాత్ర' పాత్ర మూవీ ప్రీమియర్ షో సందర్భంగా ఐశ్వర్య ఈ బ్లూ డ్రెస్‌లో మైండ్ బ్లోయింగ్ అనిపించుకుంది. ఆమె డ్రెస్సుకు తగిన విధంగా పింక్ లిప్స్, సరికొత్త హెయిర్ స్టయిల్ ఐశ్వర్యను మరింత అదంగా ఆవిష్కరించాయి. ఆమె అందాన్ని చూసిన అభిమానులు....వీలైనంత త్వరగా ఐశ్వర్య మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని తపన పడుతున్నారు.
కాన్స్ ఫెస్ట్ 6వ రోజు Blood Ties ప్రీమియర్ షోకి హాజరైన ఐశ్వర్య... వైట్ అబు జాని సందీప్ కోస్లా ఫ్లోర్ లెంత్ కలర్ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన అనార్కలి డ్రెస్ వేసుకొచ్చింది. గతంలో ఐశ్వర్య కాన్స్ ఫెస్ట్ లో వేసిన డ్రెస్సులు చూసి చాలా మంది ఆమె ఫ్యాషన్ టేస్ట్ బ్యాడ్ గా ఉందని విమర్శించారు. కానీ ఈ సారి స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ విమర్శలన్నీ తిప్పికొట్టింది ఈ సుందరి.

66వ కాన్స్ ఫిల్మ్ ఫెస్ట్ 7వ రోజు ఐశ్వర్యరాయ్ బ్లూ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకుంది.

క్లియోపాత్ర మూవీ ప్రీమియర్ షో సందర్భంగా ఐశ్వర్య ఇలా అందాల దేవతలా దర్శనం ఇచ్చింది.

ఆమె పింక్ లిప్స్, హెయిర్ స్టైల్ ఆమెను మరింత అందంగా ఆవిష్కరించాయి.

గత సంవత్సరం అధిక బరువు కారణంగా విమర్శలు ఎదుర్కొన్న ఐశ్వర్య....ఈ సారి తన సెక్సీ లుక్‌తో ఆ విమర్శలకు చెక్ పెట్టింది.

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్యరాయ్


Click it and Unblock the Notifications











