కూతురుతో కలిసి ఐష్ కాన్స్ ఫిల్మ్‌పెస్ట్‌కి..(ఫోటోలు)
ముంబై : బాలీవుడ్ అందాల రాశి ఐశ్వర్యరాయ్ కాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి కూతురు ఆరాధ్య, తన తల్లి వృంధా రాయ్‌లతో కలిసి తరలి వెళ్లింది. కాన్స్ వెలుతూ ఇటీవల ఆమె ఎయిర్ పోర్టులో కెమెరాలకు చిక్కింది. బ్లాక్ డ్రెస్‌లో కనిపించిన ఐశ్వర్య ఎంతో స్లిమ్‌గా, అందంగా కనిపించింది.
అమితాబ్ బచ్చన్ కూడా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఐశ్వర్య వస్తున్న విషయాన్ని వెల్లడించారు. కోడలు, మనవరాలు ఫిల్మ్ పెస్టివల్ కి వస్తున్నారు అని మీడియాకు సమాచారం అందించారు. ఆదివారం(మే 19)న జరిగే 100 ఏళ్ల ఇండియన్ సినిమా స్పెషల్ ఈవినింగ్ వేడుకలో ఐశ్వర్యరాయ్ ముఖ్య అతిథిగా సందడి చేయనుంది.
అదే విధంగా మే 20న ఐశ్వర్యరాయ్ రెడ్ కార్పెట్‌పై నడవనున్నారు. ఈ సారి రాకతో ఐశ్వర్యరాయ్ మొత్తం 12 సార్లు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న తారగా మారనుంది. తొలిసారిగా ఆమె సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన 'దేవదాస్' చిత్రం ప్రదర్శన సందర్భంగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి హాజరైంది. విద్యాబాలన్, సోనమ్ కపూర్, మల్లికా షెరావత్ తదితరులు తొలిరోజే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి హాజరైన సంగతి తెలిసిందే.

కూతురు ఆరాధ్య, తల్లి వృందా రాయ్‌తో కలిసి కాన్స్ ఫిల్మ్ పెస్ట్‌కి వెలుతున్న ఐశ్వర్య

ఐశ్వర్యను చూస్తుంటే బాగా బరువు తగ్గినట్లు కనిపిస్తోంది కదూ...

ఆదివారం జరిగి 100 ఏళ్ల ఇండియన్ సినిమా కార్యక్రమంలో ఐశ్వర్యకు ప్రత్యేక గౌరవం దక్కనుంది.

మే 20న ఐశ్వర్యరాయ్ రెడ్ కార్పెట్‌పై నడవనుంది.

గత సంవత్సరం కాన్స్ ఫిల్మ్ పెస్ట్‌కి హాజరైన ఐశ్వర్య బాగా లావున్న కారణంగా విమర్శలు ఎదుర్కొంది.

గత సంవత్సరం ఐశ్వర్య కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై నడుస్తున్నప్పటి దృశ్యం

ఈ సంవత్సరం ఐశ్వర్య కాన్స్ ఫెస్టివల్‌లో సంప్రదాయ చీరకట్టులో దర్శనం ఇవ్వనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











