ఐశ్వర్య రాయ్ లుక్ చూసి కేంద్ర మంత్రులు షాక్ (ఫోటోస్)
ముంబై: పాకిస్థాన్ జైల్లో ఇరవైమూడు సంవత్సరాల పాటు బందీగా వుండి హత్యకు గురైన భారతీయ ఖైదీ సరబ్జీత్‌సింగ్ నిజ జీవితకథతో దర్శకుడు ఓమంగ్‌కుమార్ (మేరీకోమ్ ఫేమ్) ‘సరబ్జీత్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సరబ్జీత్‌సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా నటిస్తున్నాడు. ఆమె సోదరి దల్బీర్‌కౌర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ మెయిన్ రోల్ చేస్తోంది.
తాజాగా ‘సరబ్జీత్' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బిజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఐశ్వర్యరాయ్ గోల్డ్ కలర్ కుర్తాలో ఎరుపు రంగు దుప్పట్టా ధరించి స్టన్నింగ్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంది. అయితే పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత పోస్టర్లో ఐశ్వర్యరాయ్ లుక్ చూసి అంతా షాకయ్యారు.
పోస్టర్లో ఐశ్వర్యరాయ్ లుక్ పూర్తిగా డీ గ్లామరస్ గా ఉండటమే ఇందుకు కారణం. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ పూర్తి దేశీ అవతారంలో పంజాబి మహిళగా డీగ్లామరస్ పాత్రలో కనిపించబోతున్నారు. బహుషా ఐశ్వర్యరాయ్ ని ఇప్పటి వరకు ఇలాంటి లుక్ లో ప్రేక్షకులు ఏ సినిమాలోనూ చూసి ఉండరు.
1990 సంవత్సరంలో మద్యం మత్తులో పాకిస్థాన్ భూభాగంలోకి ప్రశేశించిన సరబ్జీత్‌సింగ్ ను భారతీయ గూఢచారిగా అనుమానించిన పాక్‌సైన్యం జైల్లో నిర్భందించింది. లాహోర్ జైల్లో 23 సంవత్సరాల పాటు వున్న సరబ్జిత్‌ను భారత పార్లమెంట్‌పై దాడిచేసిన అఫ్జల్‌గురు మరణశిక్షకు ప్రతీకారంగా సహచర ఖైదీలు మూడేళ్ల క్రితం జైల్లోనే హత్య చేశారు. సరబ్జీత్‌సింగ్ జైల్లో ఉండగా కలిసి వచ్చిన ఆయన సోదరి దల్బీర్‌కౌర్ అక్కడ జైల్లో తన సోదరుడు పడ్డ నరకయాతనను స్వయంగా చూసింది. ఆమె అనుభవాలే కథాంశంగా సినిమా రాబోతోంది.
స్లైడ్ షోలో ఫోటోస్....

సరబ్జీత్ పోస్టర్
సరబ్జీత్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే...

ఐశ్వర్యరాయ్
ఐశ్వర్యరాయ్ గోల్డ్ కలర్ కుర్తాలో ఎరుపు రంగు దుప్పట్టా ధరించి స్టన్నింగ్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంది

ముఖ్య అథితులు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బిజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

రీచా చద్దా...
ఈ చిత్రంలో సరబ్జీత్ భార్య పాత్రలో రీచా చద్దా నటిస్తోంది.

సెల్ఫీ..
ఐశ్వర్యరాయ్ తో కలిసి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న అభిమానులు

ఓమంగ్ కుమార్
సరబ్జీత్ మూవీ గురించి మాట్లాడుతున్న దర్శకుడు ఓమంగ్ కుమార్.

పోస్టర్ రిలీజ్ ఈవెంట్
పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమం.

అంతా షాక్
పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత పోస్టర్లో ఐశ్వర్యరాయ్ లుక్ చూసి అంతా షాకయ్యారు.


Click it and Unblock the Notifications











