రీఎంట్రీ ట్యాగ్‌పై ఐశ్వర్యరాయ్ చిర్రుబుర్రు
అయితే ఇటీవల ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోందనే వార్తలు ఊపందుకున్నాయి. ఇదే విషయాన్ని ఐశ్వర్య వద్ద ప్రస్తావిస్తే కాస్త అసహనానికి గురైంది. తాను సినిమా ఇండస్ట్రీని వదిలి ఎక్కడికీ వెళ్లలేదని, కొంత కాలం సినిమాలకు సైన్ చేయలేదు అంతే. అంత మాత్రానికి 'రీ ఎంట్రీ' ట్యాగ్ తగిలించడం సరికాదని చిటపటలాడుతోంది.
ఇటీవల ఐశ్వర్యరాయ్ పూణెలో కళ్యాణ్ జ్యువెల్లర్స్ స్టోర్స్ ప్రారంభోత్సవానికి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించాడు. మీడియా వారు కంబ్యాక్ ప్లాన్స్ గురించి ప్రశ్నించగా ఇలా స్పందించారు. 'నేను సినిమాలను వదిలి ఎక్కడికీ వెళ్లలేదు అలాంటపుడు కంబ్యాక్ అని ఎలా అంటారు. కొంతకాలం విరామం తీసుకున్నాను. ఏదైనా సినిమాకు సైన్ చేసిన తర్వాత నేనే స్వయంగా ప్రకటిస్తాను' అని చెప్పారు.
ఆరాధ్యకు జన్మనిచ్చిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని, చాలా సంతోషంగా ఉన్నానని, మాతృత్వపు అనుభూతి ఎంతో హాయిగా ఉందని ఐశ్వర్యరాయ్ చెప్పుకొచ్చారు. ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా కూతురును వెంటేసుకునే వెలుతోంది ఐశ్వర్య.
కాగా...బాలీవుడ్ నుంచి వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం, కరణ్ జోహార్ ఇటీవల ఐశ్వర్యరాయ్‌ని సంప్రదించాడని, హృతిక్ రోషన్ హీరోగా రూపొందించే 'శుద్ధి' అనే సినిమాలో నటించాల్సిందిగా కోరాడని సమాచారం. మరో వైపు సంజయ్ లాలా బన్సాలీ కూడా ఐశ్వర్యతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












