ఫోటో ఫీచర్ : నాగ్ బ్రాండ్‌కు ఐష్ దేవతగా...!
ముంబై : చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అందాల సుందరి ఐశ్వర్యరాయ్ కల్యాణ్ జ్యువెల్లర్ కోసం ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇంతకు ముందు యాడ్ లో ఈ సుందరి సంప్రదాయ వేషదారణతో కనిపించగా....తాజాగా రిలీజైన్ యాడ్ పోస్టర్లో దేవతా మూర్తిని తలపించే విధంగా వేషధారణ, ఆభరణాల అలంకరణతో ఆకట్టుకుంటోంది.
ఐశ్వర్యరాయ్ ద్వారా తమ ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతాయని కళ్యాణ్ జ్యువెల్లర్స్ సంస్థ ఎంతో ఆశలు పెట్టుకుంది. అంతే కాకుందా అమితాబ్ తో పాటు దక్షిణాదిన నాగార్జునతో పాటు ఇతర సినీ పరిశ్రమలకు చెందిన ముఖ్య తారలకు కోట్లలో పారితోషికం ఇచ్చి ప్రచారం నిమిత్తం రంగంలోకి దింపింది.
ఇక ఐశ్వర్యరాయ్ సినిమా జీవితం వివరాల్లోకి వెళితే...పాపాయికి జన్మనిచ్చిన ఐశ్వర్యారాయ్ మాతృత్వపు అనుభూతిని ఆస్వాదిస్తూ గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా వుంటోంది. ఆమె సినిమా రీ ఎంట్రీపై రకరకాల కథనాలు వినిపిస్తున్నా ఇప్పటి వరకు ఏదీ కూడా ఖరారు కాలేదు.
తొలుత శ్రీరామ్ రాఘవన్'హ్యాపీ బర్త్ డే' అనే సినిమాల ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రచారం జరుగుతున్నప్పటికీ....సంజయ్ లీలా బన్సాలీ రూపొందిస్తున్న బాజీరావు మస్తానీ సినిమాలో షారుఖ్ ఖాన్‌తో కలిసి ఎంట్రీ ఇవ్వబోతోందిన మరో ప్రచారం కూడా ఉంది. సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ టైటానిక్ చిత్రంలో హాట్ లేడీ కేట్ విన్ స్లెట్ సరసన నటించిన స్టార్ బిల్లీ జేన్‌తో ఐశ్వర్యరాయ్ నటించబోతోందనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ అందాల తార మళ్లీ తెరపై దర్శనం ఇచ్చేది ఎప్పుడో.. అభిమానుల ఆశ తీరేది ఎప్పుడో..?


Click it and Unblock the Notifications











