ఐశ్వర్యరాయ్‌కి ఫ్రెంచి అవార్డ్
అవార్డు దక్కడంపై ఐశ్వర్య రాయ్ స్పందిస్తూ....'తనను ఈ అవార్డుతో గౌరవించడం ఎంతో ఆనందంగా ఉంది. ఫ్రాన్స్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ అవార్డును నేను ఎంతో గొప్పగా భావిస్తున్నాను' అని వ్యాఖ్యానించారు. అలానే నేను ఈ స్థాయికి ఎదగడానికి, నా కెరీర్ సజావుగా సాగడానికి సహకరించిన, అభిమానించిన వారికి అందరికీ ధన్యవాదాలు అని ఐశ్వర్య రాయ్ వ్యాఖ్యానించారు.
ఐశ్వర్యరాయ్ బర్త్ డే రోజైన నవంబర్ 1న ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఐశ్వర్య ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్య, అత్త మామలు జయాబచ్చన్, అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
నవంబర్ 1న ఐశ్వర్యరాయ్ 39వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఐశ్వర్య బచ్చన్ నవంబర్ 1వ తేది 1973వ సంవత్సరంలో జన్మించింది. తన నటనా జీవితాన్ని ప్రారంభించక పూర్వం, ఆమె ఒక మోడల్ గా పనిచేసినది మరియు గా 1994లో విశ్వ సుందరి కిరీటాన్ని జయించిన తర్వాత పాపులర్ అయింది. తొలుత వివేక్ ఒబెరాయ్, సల్మాన్ ఖాన్ లతో ప్రేమాయణం కొనసాగించిన ఐశ్వర్య రాయ్.... వారితో విడిపోయిన తర్వాత తనకంటే చిన్నవాడైన అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడి ఏప్రిల్ 20, 2007న పెళ్లాడింది. వారికి గత సంవత్సరం 'ఆరాధ్య' జన్మించింది.
సినీ జీవిత విశేషాల్లోకి వెళితే... మణిరత్నం దర్శకత్వంలో 1997లో వచ్చిన తమిళ చిత్రం 'ఇరువర్' ద్వారా ఐశ్వర్య రాయ్ సినీ రంగ ప్రవేశం చేసింది. ఐశ్వర్య రాయ్ కెరీర్లో తొలి కమర్షియల్ హిట్ 1998లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం జీన్స్. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో 1999లో వచ్చిన 'హమ్ దిల్ దే చుకే సనం' అనే చిత్రంతో బాలీవుడ్లో పాగా వేసిన ఐశ్వర్య ఆ తర్వాత తన హవా కొనసాగించింది.


Click it and Unblock the Notifications












