ఐశ్వర్య రాయ్ కూతురుకి రూ. 54 కోట్ల బహుమతి
వాస్తవానికి ఆమె అమ్మ కడుపులో ఉన్నప్పుడే, ఈ భూప్రపంచాన్ని చూడక ముందే సెలబ్రిటీగా మారి పోయింది. ఎందుకంటే వాళ్ల ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా సినీ సెలబ్రిటీలే కాబట్టి. ఆమె వయసు కేవలం సంవత్సరమే అయినా...తాత మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్టేటస్‌కు ఏమాత్రం తగ్గకుండా ఆమె సెలబ్రిటీ స్టేటస్ ఉంది.
తాజాగా అందిన ఆసక్తికర సమాచారం ఏమంటే...ఆరాధ్యరాయ్ బచ్చన్ తన తల్లిదండ్రులను నుంచి ఓ ఖరీదైన బహుమతి అందుకుంది. ఓ ప్రముఖ ఆంగ్లపత్రిక కథనం ప్రకారం ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ తమ ముద్దుల కూతురికి దుబాయ్ లో రూ. 54 కోట్ల విలువైన ఇల్లు కొని బహుమతిగా ఇచ్చారట.
ఇప్పటికే ఆరాధ్య తన తాతయ్య అమితాబ్ బచ్చన్ నుంచి ఖరీదైన మినీ కూపర్ కారును బహుమతిగా పొందిన విషయం తెలిసిందే. తన మనవరాలి తొలి బర్త్ డే సందర్భంగా ఈ బహుమతిని ఇచ్చి తెగ సంబరి పడిపోయాడు అమితాబ్ బచ్చన్. ఆరాధ్య నవంబర్ 16, 2011లో జన్మించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications












