మాజీ విశ్వ సుందరి, అమితాబ్ బచ్చన్ కోడలు అయిన ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం ఆటలమ్మ వ్యాధితో బాధపడుతోంది. జర్మన్ మీజిల్స్ లేదా రుబెల్లా అనే ఈ అంటు వ్యాధి సోకిన ఆమెను కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఐష్ తన పర్యటనలను రద్దు చేసుకుంది. బ్యాంకాక్‌లో ఐఐఎఫ్‌ఏ అవార్డుల ఫంక్షన్‌లో పాల్గొని వచ్చిన నాటి నుంచే ఐశ్యర్య జ్వరం, కండరాల నొప్పితో బాధపడుతోందని బచ్చన్ కుటుంబ వర్గాల భోగట్టా. అయితే ఐష్ కోలుకుంటోందని సమాచారం. అయితే ఆ ఆటలమ్మ మచ్చలేమీ ఆమె మీద మిగలకుండా యేమీమి జాగ్రత్తలు తీసుకోవాలనేదే అందరూ ఆలోచిస్తున్నారట.