మాజీ ప్రియులా మజాకా..స్టార్ హీరోయిన్ విలవిల

By Srikanya

విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్ కి ఈ మధ్య మాజీ ప్రియులు సల్మాన్ ఖాన్, వివేక్ ఒబరాయ్ లతో విసుగోచ్చేస్తోంది. తాజాగా ఆమె ముంబయిలో జరిగిన ఓ ర్యాంప్ షోకి గెస్ట్ గా అటెండయ్యింది. అదే షోకి వివేక్ ఒబరాయ్ కూడా వచ్చారు. దానిదేముందిలే అని సరిపెట్టుకుందామంటే అతని ప్రక్క సీటునే ఆమెకు కేటాయించారు. నిజానికి ఆ సీట్ ను ఆసిన్ కి కేటాయించారు. అయితే ఆ రోజు కార్యక్రమంలో అసిన్‌ ప్రదర్శన ఉండటంతో ఆమె తన వంతు రాగానే స్టేజీ మీదకి వెళ్లింది. దాంతో ఐష్‌, వివేక్‌ మధ్య ఉన్న కుర్చీ ఖాళీ అయ్యింది. ఆ ఖాళీ వల్ల పక్కనే కూర్చున్న ఫీలింగ్‌ ఇద్దరికీ ఏర్పడింది. దాంతోఇదంతా గమనిస్తున్న ప్రముఖ బాలీవుడ్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా కలుగచేసుకున్నారు. ఆయన ఆ ఖాళీ అయిన కుర్చీలో కూర్చుని ఇద్దరికి కొంత ఉపశమనం కలిగించారు. అయితే తనకీ, ఐష్‌ కీ మధ్య మనీష్‌ ఉన్నప్పటికీ వివేక్‌కి అక్కడ ఉండబుద్ధి కాలేదట. జస్ట్‌ కొన్ని నిమిషాలు మాత్రమే ఉండి అక్కడ్నుంచి జారుకున్నారు.

ఇదిలా ముగిస్తే..కొద్ది కాలం క్రిందట సల్మాన్ ఖాన్ తో ఈ తరహా తలనొప్పి ఆమెకు వచ్చింది. ఓ షూటింగ్‌ సెట్లోకి అడుగుపెడుతున్న ఆమెకి తన మాజీ ప్రియుడు సల్మాన్‌ ఖాన్‌ ఎదురుపడ్డారు. ఆ సమయంలో ఐష్‌ పడిన ఇబ్బంది మాటల్లో చెప్పలేనిది. సల్మాన్‌ మొహం కూడా జేవురించడం పలువురి దృష్టిలో పడింది. అయితే మహా నటి కావటంతో ఆమె వెంటనే ఫేస్ ఫీలింగ్స్ ను మీడియాకు కనపడకుండా కవర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ మీడియా మహా ముదురు ఆమె క్లిప్స్, సల్మాన్ ఖాన్ ఫీలింగ్స్, ఇద్దరూ కలిసిన పాత విజువల్స్, పాటలు వేసి ఓ రోజంతా సందడి చేసి రేటింగ్స్ పెంచుకున్నారు. అలా పాపం మాజీ ప్రియుల వల్ల ఐష్ కు అడపా దడపా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఐశ్వర్యా రాయ్..మణిరత్నం దర్శకత్వంలో రెడీ అవుతున్న రావణ్ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. అందులో జాతీయ ఉత్తమ నటుడు విక్రమ్ కీలకమైన పాత్ర చేస్తోంది. తమిళం, హిందీ బాషల్లో రెడీ అవుతున్న ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ కూడా మరో ముఖ్యమైన పాత్రను చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X